క్రైమ్/లీగల్

జిన్నాంలో మద్యం బెల్టుషాపుపై పోలీసులు దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గజపతినగరం, జూలై 7: మండలంలోని జిన్నాం గ్రామంలో అక్రమంగా మద్యం బెల్టుషాపు నిర్వహిస్తున్న తెప్పల వెంకన్న అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని 111 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నామని గజపతినగరం సబ్ ఇన్‌స్పెక్టర్ పి. వరప్రసాద్ శనివారం విలేఖరులకు తెలిపారు. ఇక నుండి కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే ఒకే నేరంపై రెండు,మూడు సార్లు నిందితుడు పట్టుబడితే అటువంటి వ్యక్తులపై రౌడీషీటర్‌తోపాటు ప్రత్యేక నేర ప్రవృత్తి గల నేరస్తులుగా పరిగణించి నిఘా ఏర్పాటు చేసి కేసులు నమోదు చేయడం జరుగుతుందని అన్నారు. తదుపరి చర్యలు నిమిత్తం కేసును ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారులకు అప్పగించామని చెప్పారు.