క్రైమ్/లీగల్

ఏసీబీ వలలో విఆర్వో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వల్లూరు,్ఫబ్రవరి 20: మండల కేంద్రంలోని వల్లూరు రెవెన్యూ కార్యాలయంలో మంగళవారం వల్లూరు విఆర్వో గంగమ్మ ఓ రైతు నుంచి రూ.5వేలు నగదును లంచం రూపంలో తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వలపని పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ నాగరాజు అందించిన సమాచారం మేరకు ఇటీవల చిలకలూరుపేట నుంచి కడపకు పవర్‌గ్రిడ్ లైన్ వేయడం జరిగిందని, అందులో భాగంగా తప్పెట్లలోని ఓ పొలంలో విద్యుత్ టవర్ వేయడం జరిగిందని, నష్టపరిహారం కోసం విద్యుత్ అధికారులు రెవెన్యూ అధికారుల నుంచి రైతు పొలం హక్కులకు సంబంధించిన ధృవీకరణపత్రాలు కోరగా రెండునెలల నుంచి రైతు మల్లికార్జునరెడ్డిని కార్యాలయంకు తిప్పుకుంటూ చివరకు రూ.5వేలు లంచం ఇస్తేగానీ పనిచేయననిచెప్పడంతో ఏమీ చేయలేక వారు ఏసీబీ అధికారుల దృష్టికి తెచ్చినట్లు డీఎస్పీ తెలిపారు. మంగళవారం ఉదయం 11.30గంటలకు విఆర్వో గంగమ్మ డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ప్రత్యక్షంగా పట్టుకున్నారు. ఈక్రమంలో మండలంలో ఏసీబీ అధికారుల దాడితో పలు కార్యాలయాల్లో అధికారులకు దడ పుట్టింది. గత పదిసంవత్సరాల క్రితం ఇదే రెవెన్యూ కార్యాలయంలో సర్వేయర్ భాస్కర్‌రెడ్డి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులకు చిక్కారు. తిరిగి ఇదే కార్యాలయంలో విఆర్వో ఏసీబీకి చిక్కడంతో ప్రజలలో రెవెన్యూ కార్యాలయంపై చెడు అభిప్రాయం ఏర్పడింది.