క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కురబలకోట, జూలై 10: చిత్తూరు జిల్లా కురబలకోట మండలంలోని జంగావారిపల్లి వద్ద మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. మరమ్మతులకు గురై నిలిచి ఉన్న ఐషర్ లారీని మోటార్‌సైకిల్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. బుడ్డారెడ్డిగారిపల్లెకు చెందిన చంద్రశేఖర్ (48) నగరి మునిసిపల్ కార్యాలయంలో అటెండర్‌గా పని చేస్తున్నారు. మంగళవారం విధులకు హాజరుకావడానికి తన తమ్ముడికి చెందిన ద్విచక్ర వాహనంలో తన కొడుకు వి.దేవేంద్ర, తమ్ముడి కుమారుడు వి.దినేష్ (17)లతో కలిసి బస్టాండ్‌కు వెళ్లేందుకు బయలుదేరాడు. మార్గమధ్యంలో జంగావారిపల్లె వద్ద మరమ్మతుకు గురైన ఐషర్ లారీ నిలిచి ఉన్న క్రమంలో వీరు ప్రయాణిస్తున్న మోటారుసైకిల్ వేగంగా వెళ్లి లారీని ఢీకొంది. ఈ సంఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న మదనపల్లె డీఎస్పీ చిదానందరెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన లారీడ్రైవర్‌పై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. లారీ నెంబర్ ఆధారంగా డ్రైవర్‌ను అరెస్ట్ చేయడానికి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.