క్రైమ్/లీగల్

సముద్రంలో చేపల వేట పడవ బోల్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యు కొత్తపల్లి, జూలై 12: చేపల వేటకు వెళ్లిన బోటు సముద్రంలో అలల ఉద్ధృతికి బోల్తా పడటంతో ఒక మత్స్యకారుడు మృతిచెందాడు. మరొకరు గాయపడగా, ఎనిమిది మంది సురక్షితంగా బయటపడ్డారు. తూర్పు గోదావరి జిల్లాలోని కాకినాడ సమీపంలోని ఉప్పాడ తీరంలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు అందించిన వివరాలిలా ఉన్నాయి. ఉప్పాడ తీరం నుండి 10 మంది మత్స్యకారులు గురువారం తెల్లవారుజామున చేపల వేటకు బోటులో వెళ్ళారు. వేట ముగించుకుని తిరిగి వస్తుండగా అలల ఉద్ధృతికి బోటు బోల్తా పడింది. ఈ సంఘటనలో కాకినాడకు పల్లయ్యపేటకు చెందిన ఎం దుర్గాప్రసాద్ (28) మృతి చెందగా, ఉప్పాడకు చెందిన పోలరాజుకు తీవ్ర గాయాలయ్యాయి. బోటులోని మిగిలిన ఎనిమిది మంది ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. ఈ సంఘటనపై కొత్తపల్లి ఎస్సై కృష్ణమాచారి కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పిఠాపురం ఆసుపత్రికి తరలించారు. మృతిచెందిన దుర్గాప్రసాద్‌కు భార్య, ఇద్దరు కవల ఆడపిల్లలు, ఒక కుమారుడు ఉన్నారు.