క్రైమ్/లీగల్

ఎద్దులబండిని ఢీకొన్న ఐచర్.. ముగ్గురి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాణ్యం, ఫిబ్రవరి 4 : మండల పరిధిలోని బలపనూరు సమీపంలోని తిరుమల గిరి ఎస్టేట్ -2 వద్ద ఆదివారం ఉదయం 7 గంటల ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు. వ్యవసాయ పనుల నిమిత్తం ఎద్దుల బండిపై భార్య, భర్త, ఇద్దరు కూతుర్లు, వ్యవసాయ కూలి జాకీర్‌హుస్సేన్‌తో పాటు జాతీయ రహదారిపై ఎద్దుల బండిపై వెళ్తుండగా ఎదురుగా వచ్చిన ఐచర్ వాహనం ఢీకొనడంతో సంఘటన ప్రాంతంలోనే రైతు ఉప్పరి సుబ్బరాయుడు(65), అతని భార్య నాగలక్ష్మి(55), రెండవ కుమార్తె సుజాత (40) మృత్యువాడపడ్డారు. అలాగే మృతుని మొదటి కూతురు సుమతి, వ్యవసాయ కూలీ జాకిర్ హుసేన్‌లకు తీవ్ర గాయాలు అయ్యాయి. వీరిని చికిత్సకై నంద్యాలకు తరలించారు. వీరిలో సుమతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. ఎద్దుల బండి నుజ్జు నుజ్జుకావడం బట్టి ప్రమాద తీవ్రత అర్థమవుతోంది. రోడ్డుప్రమాద సంఘటనతో బలపనూరు గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురిని ఐచర్ వాహనం బలితీసుకోవడం అందరినీ కలిచివేసింది. సమాచారం అందిన వెంటనే పాణ్యం సీఐ పార్థసారథిరెడ్డి, ఎస్‌ఐ చిరంజీవిలు ప్రమాదస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. వేరుశెనగ వ్యవసాయ పొలానికి వెళ్తుండగా ఈ దుర్గటన జరిగింది. నంద్యాల నుండి హైదరాబాదుకు డెకరేషన్ సామాను లోడుతో వెళ్తున్న ఐషర్ అదే మార్గంలో ఎదరుగా వస్తున్న ఎద్దుల బండిని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఉప్పరి సుబ్బరాయుడు, కాగా మృతుని కుమార్తె సుజాత అవుకు మండలం వేములపాడు గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. సుజాతకు ముగ్గురు కుమార్తెలు, ఒక కొడుకు, సుమతిని బండి ఆత్మకూరు మండలం ఈర్నపాడుకు చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. ఆమెకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నట్లు తెలిసింది. ఇలా ఉండగా జాతీయ రహదారి పక్కన సర్వీసురోడ్డుపై రైతులు వరి తదితర ధాన్యాలు ఆరబెట్టుకోవడంతో సాధారణంగా ఆ దారిన వెళ్తున్న సుబ్బరాయుడును వెళ్లకుండ నివారించారని, అందుచేత అతను ఇతర మార్గం లేక జాతీయ రహదారికి వ్యతిరేక దిశలో తన బండిపై ప్రయాణం చేస్తుండగా వేగంగా వస్తున్న ఐషర్ ఢీకొని ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. సమాచారం అందిన వెంటనే నంద్యాల డీఎస్పీ గోపాలకృష్ణ ప్రమాద స్థలాన్ని సందర్శించి ప్రమాదానికి గల కారణాలు విచారించారు. సర్వీసు రోడ్లపై, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లపై రైతులు తమ వ్యవసాయ ఉత్పత్తులను వేస్తుండడంతో వాహనాలు, మోటారు బైక్‌లు ప్రమాదాలకు గురవుతున్నాయని, అందుచేత పోలీసులు ఈ విషయంపై తగు శ్రద్ద వహించి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కాగా సుబ్బరాయుడు మంచివాడుగా పేరు పొంది చిన్న చిన్న పొలాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసే వాడని గ్రామస్థులు తెలిపారు. ఎంతో కష్టపడి కుమార్తెల వివాహం చేసి అప్పుల పాలయ్యారని తెలుస్తుంది. ఏది ఏమైనా బలపనూరు గ్రామ ప్రజల్లో స్థానం సంపాదించుకున్న సుబ్బరాయుడు మృతి పట్ల గ్రామ ప్రజలు విచారం వ్యక్తం చేశారు.
బలపనూరులో విషాదఛాయలు
జాతీయ రహదారిపై ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో గ్రామానికి చెందిన సుబ్బరాయుడు, అతడి భార్య, కుమార్తె, రెండు ఎద్దులు మృతి చెందడంలో బలపనూరులో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా సుబ్బరాయుడు మంచివాడుగా పేరు పొంది చిన్న చిన్న పొలాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసే వాడని గ్రామస్థులు తెలిపారు. ఎంతో కష్టపడి కుమార్తెల వివాహం చేసి అప్పుల పాలయ్యారని తెలుస్తుంది. ఏది ఏమైనా బలపనూరు గ్రామ ప్రజల్లో స్థానం సంపాదించుకున్న సుబ్బరాయుడు మృతి పట్ల గ్రామ ప్రజలు విచారం వ్యక్తం చేశారు. ప్రమాదానికి గురైన వాహనాన్ని, డ్రైవర్‌ను అరెస్టు చేసి కుటుంబ సభ్యులకు న్యాయం చేయాలని వారు అధికారులకు తెలిపారు.