క్రైమ్/లీగల్

వంద కిలోల గంజాయి పట్టివేత: ఇద్దరు అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హుకుంపేట, ఫిబ్రవరి 20: మండల కేంద్రంలో మంగళవారం ఉదయం చేపట్టిన వాహన తనిఖీల్లో 100 కేజీల గంజాయిని తరలిస్తున్న ఇద్దరిని నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్.ఐ. అందించిన వివరాల ప్రకారం స్థానిక మోదకొండమ్మ ఆలయం వద్ద వాహనాలను తనిఖీ చేపడుతుండగా జీపులో ప్రయాణిస్తున్న జర్రకొండ పంచాయితీ బురదగుమ్మి గ్రామానికి చెందిన సుర్కం నాయుడు, సీదరి ఈశ్వరరావులు అనుమానాస్పదంగా ప్రవర్తించడంతో వారిని ప్రశ్నించి వారితో ఉన్న బ్యాగ్‌లను పరిశీలించగా వాటిలో 100 కిలోల గంజాయి లభ్యమైంది. గంజాయి తరలిస్తున్న వారిపై కేసు నమోదుచేసి రిమాండ్‌కు తరలించనున్నామని ఎస్.ఐ. తెలిపారు.