క్రైమ్/లీగల్

ఇద్దరు భార్యల వివాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సామర్లకోట, ఫిబ్రవరి 20: ఇద్దరు భార్యల వివాదం చినికిచినికి గాలి వానగా మారి న్యాయం కోసం రెండో భార్య పోలీసులను ఆశ్రయించడం, భర్త సామర్లకోట పోలీస్ స్టేషన్ ఆవరణలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పెద్దాపురం పట్టణానికి చెందిన దుర్గాప్రసాద్ మంగళవారం మధ్యాహ్నం సామర్లకోట పోలీస్ స్టేషన్ వద్ద భార్యలతో ఘర్షణ పడి దోమల చక్రం వెలిగించే స్టాండుతో పీకకోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. దానిని గుర్తించిన పోలీసులు అతడిని అడ్డుకుని హుటాహుటిన సామర్లకోట ప్రభుత్వ క్లస్టరు ఆసుపత్రికి తరలించారు. పోలీసుల సమాచారం ప్రకారం పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి గ్రామానికి చెందిన చెల్లూరి దుర్గాప్రసాద్ ముందు వివాహం కాగా తనను మోసగించి పెళ్లిచేసుకున్నాడని సామర్లకోట వీర్రాఘవపురానికి చెందిన మీనాక్షి న్యాయం కోసం సామర్లకోట పోలీసులను ఆశ్రయించింది. పూజిత అనే ఆమెను పెళ్ళాడి ఏడాది క్రితం తనను పెళ్లిచేసుకున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. పూజితకు దుర్గాప్రసాద్‌కు మూడున్నరేళ్ళ కుమార్తె ఉండగా, కాకినాడలో నివాసం ఉంటున్నారు. పూజితతో వివాహమైన విషయంపై తరచూ వీరిమద్య గొడవలు జరుగుతున్నాయి. ఫిర్యాదు మేరకు విచారణకు దుర్గాప్రసాద్, మీనాక్షి, పూజిత హజరయ్యారు. ఇద్దరిని తాను బాగా చూసుకుంటానని, పోలీసు కేసులు వద్దని దుర్గాప్రసాద్ ఇద్దరికి సర్ది చెప్పినా వారు వినకపోవడంతో దుర్గాప్రసాద్ దోమల చక్రంకు ఉపయోగించే స్టీలు స్టాండును ఉపయోగించి గొంతు కోసుకుని ఆత్మహత్య యత్నంకు పాల్పడ్డాడు. ఈ సంఘటనపై మీనాక్షి ఫిర్యాదు మేరకు, ఆత్మహత్య యత్నం కింద వేర్వేరు కేసులు దుర్గాప్రసాద్‌పై నమోదు చేసి సామర్లకోట ఎస్సై ఎల్ శ్రీనువాసు నాయక్ దర్యాప్తు చేస్తున్నారు.