క్రైమ్/లీగల్

ఒడిశాలో రూ. కోటి గంజాయి స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీలేరు, జూలై 15: ఆంధ్రా- ఒడిశా మీదుగా కంటైనర్‌లో అక్రమంగా తరలిస్తున్న కోటి రూపాయల విలువ చేసే 1,060 కిలోల గంజాయిని ఆదివారం తెల్లవారు జామున ఒడిశా పోలీసులు పట్టుకున్నారు. రవాణాకు ఉపయోగించిన కంటైనర్‌తోపాటు హర్యానాకు చెందిన ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఒడిశా పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి. విశాఖ ఏజెన్సీ గూడెంకొత్తవీధి మండలం దారకొండ పరిసర ప్రాంతాల నుంచి గంజాయిని హర్యానా రాష్ట్రానికి తరలిస్తుండగా సీలేరు సమీపంలోని చిత్రకొండవద్ద పట్టుకున్నారు. అదుపులోకి తీసుకున్న కంటైనర్‌ను తనిఖీ చేయగా కొన్ని బస్తాలు కంటైనర్‌లో ఉండగా, మరికొన్ని క్యాబిన్‌లో అమర్చారు. మొత్తం 34 బస్తాలు ఉన్నాయన్నారు. వీటి బరువు 1,060 ఉండగా కోటి రూపాయలు విలువ చేస్తుందన్నారు. గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, కంటైర్‌ను సీజ్ చేశామన్నారు. నిందితులను మల్కన్‌గిరి ఏఎస్పీ ఎదుట హాజరుపరుస్తున్నట్లు చిత్రకొండ పోలీసులు తెలిపారు.