క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో వివాహిత మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సత్తెనపల్లి, ఫిబ్రవరి 20: సత్తెనపల్లి నుండి మాచర్ల వెళ్ళు ప్రధాన రహదారిలోగల నరసరావుపేట అడ్డరోడ్డు వద్దగత చెక్‌పోస్టువద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సత్తెనపల్లి మండలంలోని భీమవరం గ్రామానికి చెందిన వివాహిత మహిళ మందడి రజని (32) మృతి చెందింది. పోలీసువారి సమాచారం మేరకు చాగంటివారిపాలెం గ్రామంలో జరిగే ఒక శుభకార్యానికి వెళ్ళి తన బావ సాంబశివరావు, తోడికోడలితో కలిసి ద్విచక్రవాహనంపై తిరిగి వస్తూ నరసరావుపేట రోడ్డులోగల చెక్ పోస్టు వద్ద సత్తెనపల్లి వైపు మలుపు తిరుగుతుండగా మాచర్ల నుండి గుంటూరు వెళ్లే ఆర్‌టిసి బస్సు వెనుకనుండి వేగంగా వచ్చి ఢీకొంది. ఈ సంఘటనలో తలకు బలమైన గాయం కావడంతో తీవ్ర రక్తస్రావమై రజని అక్కడికక్కడే మృతిచెందింది. మిగిలిన ఇద్దరికి స్వల్పగాయాలయ్యాయి. వారి వద్దగల శుభకార్యంలో ఇచ్చిన బహుమతులు చెల్లాచెదురయ్యాయి. తోడికోడలు, బావ సాంబశివరావు విగత జీవురాలై పడివున్న రజని మృతదేహం వద్ద రోడ్డుపై విలపిస్తున్న తీరు చూపరులకు కంటతడిపెట్టించింది. మృతురాలికి ముగ్గురు పిల్లలు, భర్త ఉన్నారు. ఈ మేరకు పట్టణ పోలీసులు ఆర్టీసీ డ్రైవర్‌ని అదుపులోకి తీసుకొని కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సత్తెనపల్లి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. ఇలావుండగా విషయం తెలుసుకున్న స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు హుటాహుటిన పట్టణంలోని ఏరియా వైద్యశాలకు చేరుకొని మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. అనంతరం మృతురాలి కుటుంబ సభ్యులను స్పీకర్ పరామర్శించి, వారిని ఓదార్చారు.