క్రైమ్/లీగల్

హత్యకేసులో ఇద్దరు నిందితుల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం టౌన్, ఫిబ్రవరి 20: పోడు భూమి విషయంలో తలెత్తిన వివాదాలు.. తమ బంధువులను మంత్రాలు చేసి చంపాడనే నెపంతో ఇరువురు వ్యక్తులు కలిసి ఒకరిని అంతమొందించారు. కర్రలతో కొట్టి చంపి రోడ్డుపై పడేసి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసి పోలీసులకు దొరికిపోయారు. ఈ కేసులో నిందితులైన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. భద్రాచలం పోలీసుస్టేషన్‌లో మంగళవారం జరిగిన విలేకర్ల సమావేశంలో కేసు పూర్వాపరాలను భద్రాచలం పట్టణ సీఐ సత్యనారాయణరెడ్డి వివరించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. దుమ్ముగూడెం మండలం కోయనర్సాపురం గ్రామానికి చెందిన కారం రాజులు పోడు వ్యవసాయం చేస్తున్నాడు. గతంలో రాజులు ఆంధ్రాలోని యటపాక మండలం మద్దెమడుగు గ్రామంలో కొంత భూమిని పోడు చేసుకొని కంది సాగు చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 14న రాజులు మద్దెమడుగులోని తన పొలం వద్దకు వచ్చాడు. అయితే ఈ గ్రామంలోని పోడు భూమి విషయంలో ఇదే గ్రామానికి చెందిన తెల్లం కన్నయ్య, తెల్లం రాముడితో రాజులుకు గతంలో వివాదం జరిగింది. పైగా రాజులు క్షుద్రపూజలు, మంత్రాలు చేస్తున్నాడని వారు అతనిపై కక్ష పెట్టుకున్నారు. దీనికి తోడు భూ వివాదంలో ఘర్షణ పడటంతో ఎలాగైనా అతన్ని అంతమొందించాలని కక్ష పెట్టుకున్నారు. ఈనెల 14వ తేదీన తమ గ్రామం వచ్చిన రాజులును వెంబడించి కర్రలతో కొట్టి చంపారు. అయితే హత్యను ప్రమాదంగా చిత్రీకరించేందుకు నిందితులు ప్రయత్నించారు. రాజులు మృతదేహాన్ని దుమ్ముగూడెం మండలంలోని కోయనర్సాపురం, రామచంద్రునిపేట గ్రామాల మధ్య చేర్చి అదే రోజు రాత్రి ప్రధాన రహదారిపై పడేశారు. తెల్లవారుజాము తర్వాత ఆయా గ్రామాల స్థానికులు రాజులు మృతదేహాన్ని గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతుడి భార్య దుమ్ముగూడెం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తన భర్తకు, మరో కొంతమందికి భూమి విషయంలో వివాదం కొనసాగిందని, వారే తన భర్తను అంతమొందించి ఉంటారని పేర్కొంది. ఆ దిశగా దుమ్ముగూడెం ఎస్సై బాలకృష్ణ కేసును చాకచక్యంగా కొనసాగించి చేధించారు. భూ వివాదాలు, మంత్రగాడనే నెపంతో మద్దెమడుగు గ్రామానికి చెందిన తెల్లం కన్నయ్య, తెల్లం రాముడు ఈ హత్యకు పాల్పడ్డారని విచారణలో వెల్లడైంది. అయితే నిందితులు మృతదేహాన్ని రోడ్డుపై పడేస్తే వచ్చిపోయే వాహనాలతో శరీరం నుజ్జునుజ్జవుతుందని, తమపై అనుమానం రాదనే వ్యూహాంతో కేసును తప్పుదోవ పట్టించారని సీఐ తెలిపారు. నిందితులను మంగళవారం అదుపులోకి తీసుకున్నామని, వారి నుంచి ఆయుధాలను రికవరీ చేశామని, రిమాండ్‌కు పంపుతున్నామని సీఐ పేర్కొన్నారు. ఈ సమావేశంలో దుమ్ముగూడెం ఎస్సై బాలకృష్ణ, భద్రాచలం పట్టణ ఎస్సై కరుణాకర్ పాల్గొన్నారు.