క్రైమ్/లీగల్

రెడ్డి భవన్ వద్ద భూ వివాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూలై 17: సుమారు రూ. 5కోట్లు విలువచేసే 300 అంకణాల భూమికి సంబంధించి సీపీఐ నాయకులకు, ఒక బీసీ నేత మధ్య భూ వివాదం చెలరేగింది. గత ఎంతోకాలంగా ఈ వివాదం సాగుతున్నా మంగళవారం ఆ స్థలంలో బీసీ నేతకు సంబంధించిన వ్యక్తులు షెడ్లు ఏర్పాటు చేసేందుకు సమాయత్తం కావడంతో ఆ స్థలం తనదంటున్న సీపీఐ నేత వెంకయ్య వారిని అడ్డుకున్నారు. దీంతో బీసీ నేతలకు సంబంధించిన వర్గీయులు అక్కడకు చేరుకున్నారు. సమాచారం తెలుసుకున్న పట్టణ సీపీఐ నేతలు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ భూమి తమదంటే తమదని బీసీ నేత, సీపీఐ నాయకులు వాదానికి దిగారు. తన వద్ద ఉన్న రికార్డులను వెంకయ్య అక్కడకు చేరుకున్న మీడియాకు చూపించారు. క్షణాల్లో పరిస్థితి ఉద్రిక్తతంగా మారింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సలహా ఇచ్చారు. ఈ క్రమంలో సీపీఐ నేతలు రాస్తారోకో చేశారు. అనంతరం అలిపిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఘర్షణకు దిగితే ఇరు వర్గాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏదేమైనా గత కొంతకాలంగా తిరుపతి నగరంలో భూవివాదాలు సద్దుమణిగినా తాజా సంఘటనతో ఎక్కడ భూకబ్జాలు ఉద్ధృతమై శాంతి భద్రతలకు విఘాతంగా మారుతాయోనన్న భయం సగటు నగరవాసిని కలవర పెడుతోంది. పోలీసులు ఇలాంటి సంఘటనలకు అవకాశం ఇవ్వకుండా అప్రమత్తం కావాలని ప్రజలు కోరుతున్నారు.