క్రైమ్/లీగల్
ప్రమాదవశాత్తూ భవన నిర్మాణ కార్మికుడి మృతి
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
మిడుతూరు, ఫిబ్రవరి 20:మండల పరిధిలోని జలకనూరు గ్రామంలో మంగళవారం భవన నిర్మాణ కార్మికుడు సయ్యద్ అజ్మత్‌బాషా(43) ప్రమాదవశాత్తూ మృతిచెందాడు. వివరాలు.. నందికొట్కూరు పట్టణంలోని సాయిబాబాపేటలో నివాసం వుంటున్న అజ్మత్‌బాషా గౌండ పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఈక్రమంలో జలకనూరు గ్రామంలో గృహ నిర్మాణంలో భాగంగా ఇంటి ముందు మెట్లు ఏర్పాటు చేసి సెంట్రింగ్ సామగ్రి తొలగిస్తుండగా, ఉన్నఫళంగా మెట్లు కూలి అతడిపై పడడంతో అక్కడికక్కడ మృతిచెందాడు. దీంతో అతడి భార్య మహబూబ్‌బీ రోదనలు మిన్నంటాయి. అతడికి భార్య, నెలల వయస్సు వున్న కూతురు, ఒకటిన్నర సంవత్సరాల వయస్సు వున్న మరో కూతురు సంతానం. మృతదేహానికి నందికొట్కూరు ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.