క్రైమ్/లీగల్

భర్త అనారోగ్యంపై దిగులుతో భార్య మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, ఫిబ్రవరి 20: అగ్నిసాక్షిగా మూడు ముళ్లు వేసిన భర్త అనారోగ్యానికి గురికావడంతో ఆందోళన చెందిన భార్య అసువులు బాసిన సంఘటన నగరంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. స్థానిక సంతపేటకు చెందిన గాదంశెట్టి రాధాకృష్ణ గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్నారు. గత పక్షం రోజులుగా బొల్లినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం మెరుగు కాకపోవడంతో స్థానిక బృందావనంలోని మరో ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ కూడా రాధాకృష్ణ పరిస్థితిలో మెరుగు కనపడకపోవడంతో అక్కడి వైద్యుల సూచన మేరకు ఈనెల 17వ తేదిన ఆయనను నారాయణ ఆసుపత్రికి తరలించేందుకు కుటుంబ సభ్యులు సిద్ధమయ్యారు. ఈ సమయంలో భర్త వెంటే ఉన్న ఆయన భార్య రమాదేవి (52) తన భర్త ఆరోగ్యంపై ఆందోళనకు గురై అక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే రాధాకృష్ణతో పాటు రమాదేవిని కూడా కుటుంబ సభ్యులు నారాయణ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో రమాదేవి మృతి చెందారు. ఈ సంఘటనపై తదుపరి విచారణ నిమిత్తం ఆమె కుమారుడు వంశీకృష్ణ మంగళవారం 3వ నగర పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్సై సుభాని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.