క్రైమ్/లీగల్

ఫేస్‌బుక్ దుమారం...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చింతలపూడి, జూలై 19: ఈ మధ్యకాలంలో ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్‌లు వేదికగా రాజకీయ దుమారాలు రేపుతుండటం అందరికీ తెలిసిందే. కానీ అది శృతిమించి అసభ్య పదాలతో ఎదుటివారిమీద దాడి చేయడం జరుగుతుంది. ఇటీవల సుప్రీంకోర్టు ఎన్ని ఆదేశాలు జారీ చేసినప్పటికీ సోషల్ వార్ అనేది నియంత్రించలేకపోతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి ఎమ్మెల్యే పీతల సుజాతపై చింతలపూడి మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన పాతనాటి సురేష్ ఫేస్‌బుక్ ఐడీ నుంచి అసభ్య పదజాలంతో కామెంట్ వచ్చింది. దీనిపై తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు ఆగ్రహానికి గురై పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయితే సురేష్‌తోపాటు వైసీపీకి చెందిన వెంకటేష్ అనే వ్యక్తిని కూడా పోలీసులు అనుమానిస్తున్నట్టు సమాచారం. టీడీపీ మండల శాఖ అధ్యక్షుడు మోరంపూడి శ్రీనివాసరావు, అతని బంధువులకు కూడా వారిరువురు వాట్సాప్ ద్వారా అసభ్యకర మెసేజ్‌లు పంపించినట్టు తెలిపారు. దీనిపై చింతలపూడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.