క్రైమ్/లీగల్

కట్న పిశాచి కోరలకు మరో మహిళ బలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోవూరు, జూలై 19: కట్న పిశాచి కోరలకు చిక్కి మరో అబల బలైన సంఘటన కోవూరులో బుధవారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సీతారామపురం మండలం మారెంరెడ్డి పల్లె గ్రామానికి చెందిన కల్లూరి జనార్దన్ పెద్ద కుమార్తె తేజ (20)కు కడప జిల్లా పోరుమామిళ్లకు చెందిన వ్యవసాయం చేసుకునే పోకల రాజశేఖర్‌రెడ్డికి 2017లో జూన్ నెలలో వివాహం జరిగింది. వివాహ సమయంలో కట్న కానుకల కింద రూ.5 లక్షల నగదు, 14 సవర్ల బంగారం ఇచ్చేలా ఒప్పందం జరిగింది. వివాహమైన వెంటనే రూ.1లక్ష నగదును, 14 సవర్ల బంగారాన్ని ఇచ్చి పంపారు. మిగిలిన రూ.4 లక్షలను కొద్దిగా సమయం ఇస్తే ఏర్పాటు చేస్తామని గ్రామస్థులు, పెద్దల సమక్షంలో ఒప్పందం చేసుకున్నారు. అక్కడి నుంచి కట్నం డబ్బులు త్వరగా తేవాలని భార్యను భర్త, అత్తమమాలు వేధించసాగారు. ఈ క్రమంలో వీరి కాపురాన్ని కోవూరులోని కోనమ్మతోటలోకి మార్చడం జరిగింది. బుధవారం భర్త తరపున పెద్దలు వచ్చి ఆమెను తీవ్ర మానసిక క్షోభకు గురి చేయడంతో మనస్థాపానికి గురైన ఆమె ఇంట్లో ఫ్యాన్ ఉక్కికి చీరతో ఉరేసుకుంది. గమనించిన స్థానికులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న కోవూరు పోలీసులు భర్త, అత్తమామలు కుటుంబ సభ్యులుగా వచ్చిన ఆ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. కోవూరు సీ ఐ వెంకటరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.