క్రైమ్/లీగల్

సీఐ ఇంటిలో ఏసీబీ సోదాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముకరంపుర కరీంనగర్, జూలై 19: ఆదిలాబాద్ ట్రాఫిక్ సీఐ దాసరి భూ మయ్య రూ.10 లక్షల నగదుతో హైదరాబాద్ ఔటర్ రింగు రోడ్‌పై ఏసీబీకి పట్టుబడటం కరీంనగర్‌లో కలకలం రేపింది. నగదుకు సంబంధించి సీఐ స్పష్టమైన సమాధానం ఇవ్వకపోవడంతో అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు ఏకకాలంలో 8 చోట్ల తనిఖీలు నిర్వహించారు. గురువారం ఉద యం 11 గంటల ప్రాంతంలో ఔటర్ రింగు రోడ్‌పై వెళ్తున్న స్కోడా కారును ఆపి పక్కా సమాచారంతో అధికారులు తనిఖీ చేయగా సీఐ భూమయ్య పది లక్షల నగదు, 15 లక్షలు ఇచ్చి రాయించుకున్న దస్తా వేజులు లభ్యమయ్యా యి. దీనిపై ప్రశ్నించిన ఏసీబీ అధికారులకు స్పష్టమైన సమాధానం రాకపోవడంతో కారును, నగదును సీజ్ చేసి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కరీంనగర్‌లోని ఏసీబీ రేంజ్ డీఎస్పీ కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో దాసరి భూమయ్య సన్నిహితులు, బంధువుల ఇళ్లలో ఏకకాలంలో 8 చోట్ల దాడులు నిర్వహించారు. కరీంనగర్, జగిత్యాల జిల్లాల్లో భూమయ్య ఇంటితో పాటు వెల్దండి నర్సయ్య, ఎం.అంజయ్య, దుగ్యాల అజిత్‌రావు, బీ.రవీందర్, బొజ్జ శ్రీనివాస యాదవ్, లింగారెడ్డి, డి.కె.ఆనంద్‌తో పాటు హైదరాబాద్‌లోని అతని ఇల్లు, కూతురు ఇండ్లల్లో తనిఖీలు నిర్వహించారు. వీటికి సం బంధించి పూర్తి వివరాలు ఇవ్వకపోయినప్పటికీ లెక్క తేలని నగదుతో పట్టుబడిన కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు ఏసీబీ డీజీ రమణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.