క్రైమ్/లీగల్

మసాజ్ సెంటర్‌లో బెదిరింపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 20: బంజారాహిల్స్‌లోని లగ్జరీ మసాజ్ సెంటర్ యజమానిని బెదిరించేందుకు యత్నించిన నలుగురు పోలీసులు అడ్డంగా దొరికి పోయారు. రోడ్డు నెంబర్ 10లోని లగ్జరీ మసాజ్ సెంటర్‌కు వెళ్ళిన నలుగురు పోలీసులు తాము టాస్క్ఫోర్సు పోలీసులమని, మసాజ్ పేరిట వ్యభిచారం చేయిస్తున్నారంటూ యజమాన్యాన్ని బెదిరించే ప్రయత్నం చేశారు. దీంతో ఆ యజమాన్యం వారిని మాటల్లో పెట్టి, ఆ గదికి బయటి నుంచి గొళ్ళెం పెట్టేసి, బంజారాహిల్స్ పోలీసు స్టేషన్‌కు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. హెడ్ కానిస్టేబుల్ కతీబ్ అహ్మద్, పోలీసులు వేణుగోపాల్, శశికుమార్, విజయబాబును అరెస్టు చేశారు. వీరు గతంలో వేరే మసాజ్ సెంటర్లలోనూ ఇదే విధంగా డబ్బులు వసూలు చేసినట్లు పోలీసుల విచారణలో బయటపడింది.

ఎవరికి ఉపాధి హామీ?

*గందరగోళం * ఇరు వర్గాల ఘర్షణ
షాబాద్, ఫిబ్రవరి 20: మండలంలో 2017వ సంవత్సరంలో ఆరు నెలలుగా జరిగిన ఉపాధి హామీ పనులపై వారం రోజులుగా సోషల్ ఆడిట్ అధికారులు వివిధ గ్రామాలు తిరిగి సర్వే చేపడుతున్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ఉపాధి హామీ కార్యాలయంలో జిల్లా పోగ్రాం అధికారి రమణారెడ్డి కార్యక్రమాన్ని నిర్వహించారు. మక్తగూడలో రూ. 60 లక్షల వరకు పనులు జరిగినట్టు చూపించగా, అందులో దాదాపు రూ. 16 లక్షల రూపాయలు గ్రామ ప్రజాప్రతినిధులు, ఫీల్డ్‌అసిస్టెంట్ కుమ్మకై డబ్బులు వాడుకున్నారని ఇరువర్గాలు ఆరోపించ డంతో మాటామాటా పెరిగి గొడవకు దారితీసింది. దీంతో అక్కడ ఉన్న కుర్చీలతో ఒకరికొకరు కొటుకోవడంతో గందరగోళం నెలకుంది. దీంతో అధికారులు సమావేశాన్ని వాయిదా వేశారు. ఘర్షణ కారణంగా కుర్చీలు ఇరిగిపోయినట్టు మండల అభివృద్ధి అధికారిణి పద్మావతి, ఎపీవో వీరాసింగ్ పేర్కొన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎస్సై రవికుమార్‌కు ఫిర్యాదు చేశారు.