క్రైమ్/లీగల్

నకిలీ సర్ట్ఫికెట్ల అంతర్రాష్ట్ర ముఠా అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్ క్రైం, జూలై 20: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నకిలీ సర్ట్ఫికెట్లను ఒర్జినల్ సర్ట్ఫికెట్లుగా నమ్మిం చి కోటి రూపాయలు వసూలు చేసిన ఏడుగురు అంతరాష్ట్ర ముఠా సభ్యులను శుక్రవారం సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. వారినుండి 131 నకిలీ సర్ట్ఫికెట్లు, 25 యూనివర్సీటీలకు సం బంధించిన పేర్లు పూరించిన సర్ట్ఫికె ట్లు, సర్ట్ఫికెట్ల తయారీకి ఉపయోగించే రెండు ల్యాప్‌టాప్‌లు, మూడు కలర్ ప్రింటర్లు, ట్యాబ్, ఐప్యాడ్, 11సెల్‌ఫోన్లు, 10వేల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సాయంత్రం వరంగల్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో సీపీ రవీందర్ నిందితుల వివరాలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన పశ్చిమ గోదావరి జిల్లా, జంగారెడ్డి గూడెంకి చెందిన ప్రధాన నిందితుడు సింహాద్రి మనోజ్, ఆంధ్ర వర్సిటీలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న విశాఖ పట్నం జిల్లా, పోతిన మల్లయ్య పాలెం గ్రామానికి చెందిన కోండిశెట్టి నాగభూషణం, ఆంధ్ర యూనివర్సిటీలో అటెండర్‌గా పనిచేస్తున్న సంసాద బాపురాజులతో కలిసి నకిలీ సర్ట్ఫికెట్ల తయా రు చేసి, రెండు తెలుగు రాష్ట్రాల్లో విక్రయించడానికి పథకం రూపొందించాడు. అంతేకాకుండా వీరికి తోడుగా కృష్ణ జిల్లా, పటవేమవరంకి చెందిన పిహెచ్‌డి విద్యార్థి గడ్డల నాగరాజు, ఆంధ్రయూనివర్సిటీ అధ్యాపకునిగా పనిచేస్తున్న విశాఖ పట్టణానికి చెందిన రాబిల్లి సూర్యనారాయణ, శ్రీకాకుళం జిల్లాకు చెందిన పెండ్యాల సత్యనారాయణతోపాటు తెలంగాణ మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌కు చెందిన ప్రైవేట్ ఇంజనీర్ నిట్టూరి వెంకటేశ్‌ను, ప్రధాన నిందితుడైన సింహాద్రి మనోజ్ నకిలీ సర్ట్ఫికెట్ల ముఠాలో సభ్యులుగా చేర్చుకున్నాడు. దేశంలోని పేరున్న యూనివర్సీటీలకు సంబంధించి ఇంజనీరింగ్, పీజీ, డిగ్రీ, డిప్లొమో, ఇంటర్ సర్ట్ఫికెట్లను తయారు చేస్తూ ఒక్కో సర్ట్ఫికెట్‌ను 75 వేల రూపాయలకు విక్రయిస్తున్నారు. కరీంనగర్‌కు చెందిన గాజుల రవితేజ 30 వేలకు డిప్లొమా సర్ట్ఫికెట్, వరంగల్ జిల్లాకు చెందిన సుదమల్ల ప్రశాంత్ 75వేలకు తీసుకు న్న ఇంజనీరింగ్ పాస్ సర్ట్ఫికెట్స్ నకిలీవిగా తేలడంతో పోలీసులను ఆశ్రయించారు. విచారణ చేపట్టిన సిసి ఎస్ పోలీసులకు అందిన ప్రత్యేక సమాచారంతో వరంగల్ నగరంలోని సాయిగణేష్ లాడ్జ్‌లో ఏడుగురు ముఠా సభ్యులను అరెస్టు చేశారు.