క్రైమ్/లీగల్

కత్తిపోట్ల కలకలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, జూలై 21: నిజామాబాద్ జిల్లా కేం ద్రంలో శనివారం సాయంత్రం కత్తిపోట్ల సంఘటన తీవ్ర కలకలం సృష్టించింది. పాతకక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యర్థి వర్గానికి చెందిన వారు పథకం ప్ర కారం జరిపిన దాడిలో నవ యువకులైన సొంత అన్నదమ్ములు ఇద్దరు మృ త్యువాత పడ్డారు. తల్వార్‌లు, పదునైన కత్తులతో సుమారు పది మంది మూకుమ్మడిగా విరుచుకుపడి ఇరువురిని హతమార్చారు. ఇదివరకు మూడు నెలల క్రితం కూడా వీరిపై ఇదే తరహాలో కత్తులతో దాడి చేయగా, ఆ సమయంలో తీవ్ర గాయాలతో తప్పించుకోగలిగారు. ఈసారి మాత్రం పకడ్బందీ వ్యూహంతో తాము ఎంచుకున్న ప్రదేశానికి అన్నదమ్ములను పిలిపించి విచక్షణారహితంగా కత్తులతో పొడిచి చంపారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. నగరంలోని ఆదర్శనగర్ దుబ్బ ప్రాంతానికి చెందిన పవన్‌కల్యాణ్ యాదవ్(24), నర్సింగ్‌యాదవ్‌లు సొంత అన్నదమ్ములు. పవన్ ఐటీఐ చేస్తుండగా, నర్సింగ్ ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. ఇదే ప్రాంతానికి చెందిన తల్వార్ సాయి అనే మరో యువకుడితో వీరికి స్నేహం ఉండేది. వీరు ముగ్గురు కలిసి విక్కీ యాదవ్ అనే వ్యక్తితో సన్నిహితంగా మెలిగేవారు. సదరు విక్కీయాదవ్ చిన్నచిన్న సెటిల్‌మెంట్‌లు చేసేవాడని స్థానికుల ద్వారా తెలిసింది. అయితే మూడు మాసాల క్రితం ఏదో విషయమై పవన్, నర్సింగ్‌లకు విక్కీయాదవ్‌తో విభేదాలు ఏర్పడినట్టు సమాచారం. దీంతో అన్నదమ్ములపై ఆగ్రహించిన విక్కీయాదవ్, వారిపై మూడు మాసాల క్రితమే దాడి చేయించినట్టు తెలిసింది. ఆ దాడి నుండి సోదరులు ఇద్దరు తప్పించుకుని ప్రాణాలతో బయటపడడంతో తాజాగా మరోమారు పకడ్బందీ పథకం రూపొందించినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. శనివారం సాయంత్రం తల్వార్ సాయి ద్వారా పవన్, నర్సింగ్‌లను రైల్వే స్టేషన్ వెనుక భాగంలోని మైదానం ప్రాంతానికి పిలిపించుకుని, వారు చేరుకున్న వెంటనే అక్కడ మాటు వేసి ఉన్న సుమారు పది మంది ఒక్కసారిగా తల్వార్‌లు, కత్తులు, ఇతర మారణాయుధాలతో అన్నదమ్ములపై మూకుమ్మడిగా విరుచుకుపడ్డారు. గొంతులు కోసి, ఛాతీలో పొడుస్తూ, ఇతర శరీర అవయవాలపై ఇష్టారీతిన కత్తులు దించడంతో పవన్‌యాదవ్, నర్సింగ్ యాదవ్‌లు సంఘటనా స్థలంలోనే కుప్పకూలిపోయారు. అనంతరం నిందితులు అక్కడి నుండి పారిపోగా, స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో అన్నదమ్ములను హుటాహుటిన జిల్లా ఆసుపత్రికి తరలించారు. అప్పటికే వారు మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనకు పాల్పడిన అనంతరం సాయి తల్వార్ పోలీసుల ఎదుట లొంగిపోయినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. కత్తిపోట్లు చోటుచేసుకుని ఇద్దరు హత్యకు గురైన నేపథ్యంలో నగరంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా గట్టి పోలీసు బందోబస్తు నిర్వహించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పికెటింగ్‌లను ఏర్పాటు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని త్రీటౌన్ ఎస్‌ఐ కృష్ణ తెలిపారు.