క్రైమ్/లీగల్

పూతలపట్టు జాతీయ రహదారిలో రోడ్డు ప్రమాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పూతలపట్టు, జూలై 21: చిత్తూరు-నాయుడుపేట జాతీయ రహదారిలోని పూతలపట్టు మండలం ఒంటిళ్లు వద్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. చిత్తూరు నుంచి తిరుపతి వైపు వెళ్తున్న రెండు కార్లను ఎదురుగా వచ్చిన కంటైనరు ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. వేగంగా వచ్చిన కంటైనరు ఈ కార్లపై దూసుకెళ్లడంతో ఈ రెండు కార్లు నుజ్జునుజ్జు అయ్యాయి. రెండు కార్లలో చిక్కుకున్న వారిని అతికష్టం మీద గ్రామస్తులు జేసీబీల సాయంతో బయటకు తీశారు. సంఘటనా స్థలంలోనే ఒకరు మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమద్యలో మృతి చెందాడు. జాతీయ రహదారిలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కర్నాటక రాష్ట్రం టుముకూరుకు చెందిన శివరాజ్(30) తన కుటుంబ సభ్యులతో కలసి తిరుమలకు వెళ్తున్నారు. మరో కారులో గుంటూరు జిల్లాకు చెందిన సురేష్‌రెడ్డి తన కుటుంబ సభ్యులతో బెంగుళూరు నుంచి గుంటూరుకు వెళ్తున్నారు. ఈ రెండు కార్లు వెనుక ముందు వెళ్తుండగా ఎదురుగా వచ్చిన కంటైనరు ఒంటిళ్ళు వద్ద ఢీకొంది. గుంటూరుకు వెళ్తున్న సురేష్‌రెడ్డి(43) అక్కడికక్కడే మృతి చెందగా, కర్నాటక నుంచి తిరుమలకు మరో కారులో వెళ్తున్న శివరాజ్(30) అతి కష్టం మీద వెలికి తీసి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమద్యలో మృతి చెందాడు. అయితే ఈ ఘటనలో కర్నాటక వాసులైన బసవరాజు, తిరుపువన్, గుంటూరుకు చెందిన అనిత(48), యజ్ఞ(22) తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం వేలూరు సీఎంసీకి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు.