క్రైమ్/లీగల్

గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుత్తి, జూలై 22 : పట్టణ శివార్లలోని ఆశానగర్ శివార్లలో గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుత్తి ఎస్‌ఐ యువరాజ్ తెలిపిన వివరాల మేరకు పట్టణ శివార్లలోని ఆశానగర్ వెనుకవైపు గుట్టల్లో గుర్తు తెలియని 65 సంవత్సరాల వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలాన్ని పరిశీలించగా మృతదేహం వద్ద పురుగుల మందు డబ్బా ఉంది. దీంతో మృతుడు ఉద్దేశ పూర్వకంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నామన్నారు. ఘటనా స్థలంలో తెల్ల అంగీ, తెల్లపంచె, ఊదా రంగు చెప్పులు లభ్యమయ్యాయన్నారు. మృతదేహం దాదాపు కుక్కలు పీక్కుతిని ఉండడంతో మృతుడి వివరాలు తెలుసుకోవడం కష్టతరంగా మారిందన్నారు. ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.