క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మడకశిర, జూలై 22 : పట్టణ సమీపంలోని మెట్టబండ పాళ్యం వద్ద ట్రాక్టర్, ద్విచక్ర వాహనం ఆదివారం ఢీకొన్న ప్రమాదంలో దాదాపీర్ (30) మృతి చెందాడు. మరో వ్యక్తి గాయాలకు గురయ్యాడు. పట్టణంలోని మారుతీనగర్‌లో నివాసం ఉంటున్న దాదాపీర్, బాబా ఫకృద్దీన్ ద్విచక్ర వాహనంలో గుడిబండ మండలం ఎస్‌ఎస్ గుండ్లుకు కూలీ పనులు చేయడానికి వెళ్తుండగా మెట్టబండ పాళ్యం వద్ద ముందు వెళ్తున్న ట్రాక్టర్‌ను ఓవర్‌టేక్ చేస్తూ అదుపు తప్పి కిందకు పడ్డారు. దీంతో వెనుక వస్తున్న ట్రాక్టర్ వేగంగా వస్తూ దాదాపీర్ తలపై పోవడంతో తీవ్రగాయాలకు గురయ్యాడు. వెంటనే చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్‌లో మడకశిర ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడ మృతి చెందాడు. కాగా మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
నల్లమాడ, జూలై 22: మండల పరిధిలోని గోపేపల్లికి చెందిన గంగులప్ప(48) ట్రాక్టర్ పైనుండి కింద పడి మృతి చెందిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. గంగులప్ప కూలీ పనులు చేసుకుంటూ ట్రాక్టరులో మలకవేముల వైపు కూలీకి వెళ్తూ చిగినేకుంట వద్దకు రాగానే మూర్చవ్యాధి రావడంతో ట్రాక్టర్‌లో నుండి కిందకు పడి మృతి చెందాడు.
ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృత్తి
తలుపుల, జూలై 22: మండల పరిధిలోని బట్రేపల్లి అటవీ ప్రాంతంలోని జలపాతం సమీపంలో కదిరి-పులివెందుల రహదారిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన నరసింహులు(55) శనివారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మూడు రోజుల క్రితం ఆటో బోల్తా పడడంతో ముగ్గురు ప్రయాణికులు గాయపడిన విషయం తెలిసిందే. కాగా నరసింహులు అనంతపురం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్‌ఐ నగేష్ తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.

చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
ముదిగుబ్బ, జూలై 22: మండల పరిధిలోని కొండగట్టుపల్లికి చెందిన టీడీపీ కార్యకర్త రత్నమయ్య తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. రత్నమయ్య కొద్ది రోజుల క్రితం విద్యుత్ షాక్‌కు గురై తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స కోసం తిరుపతి తరలించారు. రత్నమయ్య మృతి చెందడం పట్ల టీడీపీ రూరల్ కన్వీనర్ దేవేంద్రరెడ్డి సంతాపం తెలిపారు.
వ్యక్తి ఆత్మహత్య
పెద్దవడుగూరు, జూలై 22 : మండల పరిధిలోని వీరన్నపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీరెడ్డి (40) ఆదివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. లక్ష్మీరెడ్డి కొన్ని సంవత్సరాలుగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడేవాడు. ఎక్కడ వైద్యం చేయించినా బాగుకాకపోవడంతో జీవితంపై విరక్తిచెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రమేష్‌రెడ్డి తెలిపారు.