క్రైమ్/లీగల్

దొంగ నోట్ల కలకలం..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాల్వశ్రీరాంపూర్, జూలై 22: కాల్వశ్రీరాంపూర్ మండలంలో శనివారం రాత్రి దొంగనోట్ల ముఠా సభ్యులు పోలీసులకు చిక్కడంతో కలకలం రేపింది. టాస్క్ఫోర్స్ అధికారులు కాల్వశ్రీరాంపూర్, ఓదెల మండలాల పోలీసులు ఓదెల మం డలంలోని గుంపులవద్ద దొంగనోటును ముద్రించే యంత్రంతోపాటు కొంత నగ దు అయిన దొంగనోట్లను పట్టుకున్నట్లు సమాచారం. ఈవిషయమై ఆదివారం జిల్లావ్యాప్తంగా సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. ఓదెల, సుల్తానాబాద్, కాల్వశ్రీరాంపూర్, పెద్దపల్లి మండలాలకు చెందిన పలువురు ముఠాగా ఏర పడి దొంగనోట్లను ముద్రించి చలామణి చేస్తున్నట్లు సమాచారం. మండల కేంద్రానికి చెందిన ఒకవ్యక్తితోపాటు గంగారం, చిన్నరాత్‌పల్లి, పందిళ్ల గ్రామాలకు చెం దిన పలువురిని పొత్కపల్లి పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నట్లు సమాచారం. మండల కేంద్రంలో దొంగనోట్ల చలామణి జరుగుతున్నట్లు ప్రజలకు తెలియడంతో దుకాణదారులతోపాటు ప్రజలు వస్తువులను కొనుగోలు చేసేందుకు భయాందోళనకు గురి కావాల్సి వస్తుంది.