క్రైమ్/లీగల్
ఫోర్జరీ వివాదంలో భీమవరం డీఎన్నార్ కళాశాల
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Tuesday, 24 July 2018
భీమవరం, జూలై 23: రాష్టవ్య్రాప్తంగా ప్రసిద్ధిచెందిన పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం దంతులూరి నారాయణరాజు కళాశాల (డిఎన్నార్ కళాశాల) వివాదంలో చిక్కుకుంది. కళాశాలలో అదనపు భవనాల నిర్మాణం నిమిత్తం ఫోర్జరీ సంతకాలతో సిండికేట్ బ్యాంకు నుండి రూ.10 కోట్లు రుణం తీసుకున్నారంటూ కళాశాల పాలకవర్గ అధ్యక్షుడు గోకరాజు వెంకట నరసింహరాజు, సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ గాదిరాజు సత్యనారాయణరాజు (బాబు)పై భీమవరం రెండో పట్టణ పోలీసులు కేసు నమోదుచేశారు. వీరిలో నరసింహరాజు నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు సోదరుడు కాగా, సత్యనారాయణరాజు రాష్ట్ర అటవీ అభివృద్ధిసంస్థ డైరెక్టర్ కావడం గమనార్హం.