క్రైమ్/లీగల్

అనంత ఎస్‌బీఐలో భారీ దోపిడీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం సిటీ, జూలై 28: అనంతపురం నగరంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో దొంగలు పడ్డారు. జేఎన్‌టీయూ సమీపంలోని ఎస్‌బీఐ బ్రాంచిలోకి శుక్రవారం రాత్రి ఇద్దరు దొంగలు చొరబడి రూ.39 లక్షల నగదు ఎత్తుకెళ్లారు. గ్యాస్ కట్టర్ సాయంతో కిటికీ చువ్వలు తొలగించి లోనికి ప్రవేశించిన దొంగలు సీసీ కెమెరాలను ధ్వంసం చేసి లాకర్‌కు రంధ్రం చేసి అందులోని నగదు చోరీ చేశారు. శనివారం ఉదయం బ్యాంకు తాళాలు తీసిన సిబ్బంది లాకర్‌కు కన్నం ఉండడం గమనించి పోలీసులకు సమాచారం అందించారు. నగరంలో కలకలం రేపిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. శుక్రవారం అర్థరాత్రి దాటిన తరువాత ఇద్దరు దొంగలు జేఎన్‌టీయూ సమీపంలోని ఎస్‌బీఐ వెనుక వైపు ఉన్న కిటికీ గ్రిల్స్ తొలగించి లోనికి చేరుకున్నారు. స్ట్రాంగ్ రూమ్‌లో మూడు అరలు ఉండగా అందులో నగదు ఉన్న అరకు గ్యాస్ కట్టర్‌కు రంధ్రం చేసి చేతికి అందినంత దోచుకెళ్లారు. బ్యాంకులో దాదాపు 10 కెమెరాలు ఉండగా వాటిలో మూడింటిని దొంగలు ధ్వంసం చేశారు. చోరీకి వచ్చిన ఇద్దరు దొంగల చిత్రాలు ఓ కెమెరాలో లభించాయి. బ్యాంకులోకి ప్రవేశించిన దుండగులు తొలుత అలారం మోగకుండా ధ్వంసం చేశారని, స్ట్రాంగ్ రూం వైపు వెళ్లి అక్కడ ఉన్న సీసీ కెమెరాలను పగులగొట్టి అనంతరం స్ట్రాంగ్ రూంకు కన్నం వేసి అందులోని నగదు ఎత్తుకెళ్లినట్లు పోలీసులు నిర్ధారించారు. సిబ్బంది సమక్షంలో స్ట్రాంగ్ రూంను తెరిపించిన పోలీసులు నగదును లెక్కించగా రూ.39 లక్షలు చోరీకి గురైనట్లు తేలింది. చోరీ సమయంలో ఎక్కడా వేలిముద్రలు పడకుండా దొంగలు జాగ్రత్తలు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు డీఎస్పీ వెంకట్రావుతెలిపారు. సంఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ సందర్శించారు. పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

చిత్రం.. అనంతపురం నగరంలో దోపిడీ జరిగిన ఎస్‌బీఐ. కిటికీ చువ్వలు విరగ్గొట్టిన దృశ్యం