క్రైమ్/లీగల్

టీటీడీ ఉద్యోగి బలవన్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూలై 29: తిరుమల కళ్యాణకట్టలో పనిచేస్తున్న విజయ్ అనే ఉద్యోగి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆదివారం ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చోటుచేసుకుంది. గత 35 రోజుల వ్యవధిలో ఆత్మహత్యకు పాల్పడిన వారి సంఖ్య విజయ్‌తో కలిపి నాలుగుకు చేరింది. కుటుంబ కలహాలు, అధికారుల వేధింపులు ఇలాంటి అంశాలతో సూసైడ్ నోట్లు రాసి గత 35 రోజుల వ్యవధిలో ముగ్గురు చనిపోగా ఆదివారం ఆత్మహత్యకు పాల్పడిన విజయ్ కుటుంబ కలహాల కారణంగా బలవన్మరణానికి పాల్పడినట్లు ప్రచారం సాగింది. అయితే ఆయన భార్య, తల్లి చెబుతున్న కథనం మేరకు గత కొంతకాలంగా విజయ్ కడుపు నొప్పి భరించలేకపోతున్నానని అన్నట్లు ఈ కారణంగానే ఆత్మహత్యకు పాల్పడినట్లు చెబుతున్నారు.
గత మూడు సంవత్సరాల క్రితం తండ్రి మరణంతో విజయ్‌కు తిరుమల కళ్యాణకట్టలో నారుూబ్రాహ్మణుడిగా కొలువు లభించింది. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య తన ఇద్దరు బిడ్డలతో కలిసి పుట్టింటికి వెళ్లడం, తల్లి మరో శుభకార్యం నిమిత్తం వెళ్లే నేపథ్యంలో విజయ్ ఆదివారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. గత 35 రోజుల్లో 35 సంవత్సరాల వయసు కలిగిన భిన్న హోదాలో ఉన్న టీటీడీ ఉద్యోగులు ఆత్మహత్యకు పాల్పడటం ఇటు ఉద్యోగులు, అటు టీటీడీ యాజమాన్యంలోను కలవరం పుట్టిస్తోంది.