క్రైమ్/లీగల్

రోటోమాక్ అధినేత కొఠారి అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: అనేక బ్యాంకుల కన్సార్టియంను 3695 కోట్లకు పైగా ముంచేసిన రోటోమాక్ యజమాని విక్రమ కొఠారి, ఆయన కుమారుడు రాహుల్‌ను సీబీఐ అధికారులు గురువారం అరెస్ట్ చేశారు. వీరిద్దరూ ఆ కంపెనీ డైరెక్టర్లు కావడం గమనార్హం. కొఠారి, ఆయన కుమారుడిని విచారణకు పిలిచిన ప్రధాన కార్యాలయానికి పిలిచిన సీబీఐ, అనంతరం వారిని అరెస్ట్ చేసింది. వీరిద్దరూ విచారణకు సహకరించకపోవడం వల్లే అరెస్ట్ చేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి. 2008 నుంచీ రోటోమేక్ గ్లోబల్ ప్రైవేట్ లిమిటెడ్ పేరిట 7 జాతీయ బ్యాంకుల కన్సార్టియం నుంచి 2919 కోట్ల రూపాయల మేర కొఠారి రుణాలు తీసుకున్నారని, వడ్డీతో కలిపి మొత్తం 3695 కోట్లకు చేరిందని అధికారులు వివరించారు. బ్యాంకు ఆఫ్ బరోడా ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ వ్యవహారంపై సీబీఐ దృష్టి పెట్టింది. నీరవ్ మోదీ, మెహల్ చోక్సీ తరహాలో కొఠారి కూడా దేశం వదిలి పారిపోయే అవకాశం ఉందన్న ఆందోళనల నేపథ్యంలో ఆయనను అరెస్ట్ చేశా రు. కాగా, ఆదాయం పన్ను ఎగవేసిన కేసులోనూ రోటోమేక్ కంపెనీకి ఆదా య పన్ను విభాగం షోకాజ్ నోటీసులు జారీ చేసింది. బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి 456.63 కోట్లు, బ్యాంకు ఆఫ్ ఇండియా నుంచి 754.77, ఓవర్సీస్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 771.07, యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా నుంచి రూ.458.95 కోట్ల మేర రోటోమేక్ సంస్థ రుణాలు తీసుకుంది. బ్యాం కు ఆఫ్ బరోడా ఇచ్చిన ఫిర్యాదుతోనే కొఠారి, ఆయన భార్య సాధన, కుమారుడు రాహుల్, కొందరు అజ్ఞాత బ్యాం కు అధికారులపై కేసు నమోదు చేసినట్టు సీబీఐ అధికారులు వెల్లడించారు.