క్రైమ్/లీగల్

నకిలీ ఐఏఎస్ అధికారికి అరదండాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, ఆగస్టు 3 : నగరంలో ఓ చర్చికి సంబంధించిన భూ తగాదాలో తాను చెప్పిన వారికి అనుకూలంగా వ్యవహరించాలని డిమాండ్ చేస్తూ ఏకంగా ఓ పోలీసు అధికారికే ఫోన్ చేసి దుర్భాషలాడి, బెదిరింపులకు పాల్పడిన నకిలీ ఐఏఎస్ అధికారి అనంతపురం పోలీసులు అడ్డంగా బుక్కయ్యాడు. నిందితుడు గుంటూరు పట్టణం వల్లూరు వారి తోట పరిధిలోని అరండల్‌పేట్, బృందావన్ గార్డెన్‌కు చెందిన బోరుగడ్డ అనిల్‌కుమార్ (32). ఇతన్ని స్థానిక టూ టౌన్ పోలీసులు గుంటూరులో అరెస్టు చేసి నగరానికి తీసుకొచ్చి కోర్టులో హాజరు పర్చారు. కోర్టు ఈనెల 16 వరకు రిమాండ్ విధించింది. టూ టౌన్ పోలీసులు తెలిపిన మేరకు వివరాల్లోకి వెళితే.. గత నెల (జూలై) 22న సాయంత్రం 6.22 గంటలకు, అలాగే రాత్రి సుమారు 8.39, 8.40, 8.42 గంటలకు అనంతపురం త్రీ టౌన్ ఇన్‌స్పెక్టర్ సెల్‌కు ఓ వ్యక్తి కాల్ చేశాడు. తన పేరు రాజశేఖర్ అని, తాను ప్రభుత్వ ఫైనాన్స్ అడ్వయిజర్‌నని ఒకసారి, ఐఏఎస్ ఆఫీసర్‌ను అని మరోసారి చెప్పి ఇన్‌స్పెక్టర్‌ను దూషించాడు. నీవు రౌడీవా? చర్చి సమస్యల్లో నీవు ఎందుకు జోక్యం చేసుకుంటున్నావు? అని నానా దుర్భాషలాడాడు. మేము చెప్పి తిమోతి గ్రూప్‌నకు సపోర్టు చేయమంటే, ఆపోజిట్ గ్రూప్‌నకు సపోర్ట్ చేస్తావా? నీవు అనంతపురం త్రీ టౌన్ పోలీసు స్టేషన్లో ఉద్యోగమెలా చేస్తావో చూస్తా అంటూ బెదిరించాడు. దీంతో అనుమానం వచ్చి ఆయనెవరని ఇన్‌స్పెక్టర్ విచారించగా, ఇతను నకిలీ ఐఏఎస్ అని, ఫైనాన్స్ అడ్వయిజర్‌లు కూడా నకిలీలేనని తేలింది. ఈ క్రమంలో లోతుగా విచారణ చేయడంతో ఓసెల్ నంబరు తాతోటి జాకోట్ స్వరూప్ కుమార్ పేరున, మరో నంబరు బోరుగడ్డ అమృతవల్లి పేరున సిమ్ కార్డులు తీసుకున్నట్లు తేలింది. దీంతో జూలై 26న నగర త్రీ టౌన్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. అనంతరం నిందితుడిని గుంటూరులో అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. విచారణ నేపథ్యంలో ఇతను 2016 ఏప్రిల్‌లో గుంటూరు జిల్లా తాడికొండ పోలీసు స్టేషన్ పరిధిలో ‘తాను ఓ మంత్రి అల్లుడినని’ చెప్పి సురేష్ బాబు అనే వ్యక్తిని బెదిరించి, అతన్ని మోసగించి, అతను కొన్న భూమిని వదిలి వెళ్లాలని డిమాండ్ చేశాడు. దీనిపై కేసు నమోదు కావడంతో రిమాండ్‌కు కూడా వెళ్లి వచ్చాడు. అదే సంవత్సరం మే నెలలో గుంటూరు జిల్లా పెదకాకాని పోలీసు స్టేషన్ పరిధిలో మండల సర్వేయర్‌ను కలిసి అతనితో తాను మినిస్టర్ మనిషినని, తాను కొన్న భూమికి వెంటనే సర్వే చేసి సర్ట్ఫికేట్ ఇవ్వాలని కోరడంతో సర్వేయర్ కుదరని చెప్పాడు. దీంతో దుర్భాషలాడి బెదిరించిన ఘటనలో పెదకాకాని పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. అంతేకాకుండా ఓ యువతిని వేదఙంచిన కేసులో అరండల్‌పేట్ పోలీసు స్టేషన్లోనూ కేసు నమోదైంది. ఇతను ప్రముఖులతో ఫోటోలు దిగి, తనకు వారితో పరిచయం ఉన్నట్లు నమ్మించి మోసం చేయడమే ప్రధాన వృత్తిగా పెట్టుకున్నట్లు వెల్లడైంది. ఇదే తరహాలో అనంతపురం త్రీ టౌన్ ఇన్‌స్పెక్టర్‌కు ఫోన్ చేసి బెదిరించి అడ్డంగా బుక్కయ్యాడు. ఇతని ఆగడాలకు జిల్లా పోలీసులు అడ్డుకట్ట వేశారు. స్థానిక టూ టౌన్ పోలీసు స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఆరోహణరావు, త్రీ టౌన్ ఎస్ ఐ శంకర్‌రెడ్డి నిందితున్ని అరెస్టు చేసి స్థానిక కోర్టులో హాజరు పర్చారు.