క్రైమ్/లీగల్

క్రికెట్ బుక్కీల ముఠా అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఆగస్టు 3: క్రికెట్‌బెట్టింగ్‌కు పాల్పడుతున్న 16 మంది సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వివరాలను శుక్రవారం రూరల్ ఎస్‌పి సిహెచ్ వెంకటప్పల నాయుడు విలేఖర్లకు తెలియజేశారు. నరసరావుపేటకు చెందిన రహీమ్, వలి, కృష్ణ, నాగార్జున, మురళి, అరుణ్, ప్రమోద్, బాదుల్లా, నకరికల్లుకు చెందిన బోజ్యా, వినుకొండకు చెందిన రమేష్, పెదకూరపాడుకు చెందిన విష్ణు, కృష్ణాజిల్లా, కంచికచర్లకు చెందిన రమేష్, గుంటూరుకు చెందిన గోపి, తెనాలికి చెందిన గుంటిలు క్రికెట్ బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నారు. గురువారం రాత్రి నర్సరావుపేట శివారు వాసవీ బృందావన కాలనీలో క్రికెట్ బెట్టింగ్‌లు నిర్వహిస్తుండగా సమాచారం అందుకున్న నర్సరావుపేట రూరల్ పోలీసులు దాడి చేసి బుక్కీలను అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుండి 2,86,120 రూపాయలు, కారు, 10 సెల్‌ఫోన్‌లు పట్టే కమ్యూనికేటర్ బాక్సు, మూడు ల్యాప్‌ట్యాప్‌లు, మూడు సెల్‌ఫోన్‌లు, టివి స్వాధీనం చేశారు. నిందితుల్లో నర్సరావుపేటకు చెందిన రహీమ్ మొదట ఆటోకన్సల్టెంట్‌గా ఉండి వచ్చే ఆదాయం సరిపోక క్రికెట్ బెట్టింగ్‌లు నిర్వహిస్తూ అక్రమ ధనర్జానకు అలవాటుపడ్డాడు. ఇతనిపై నర్సరావుపేట పట్టణ, రూరల్ పోలీసుస్టేషన్లలో పలు కేసులు నమోదైయున్నాయి. జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత పలువురిని సభ్యులుగా చేర్చుకుని బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నాడు. నెలరోజుల క్రితం నర్సరావుపేట శివారు ఇసప్పాలెం గ్రామంలోని వాసవీ బృందావన కాలనీలో ఇల్లు అద్దెకు తీసుకుని బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఆకస్మికంగా దాడిచేసి అరెస్ట్‌చేశారు. బుక్కీలను అరెస్ట్‌చేసిన పోలీసులను రూరల్ ఎస్‌పి అభినందించారు.