క్రైమ్/లీగల్

గూడ్సు కింద పడి ప్రేమజంట ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బేతంచెర్ల, ఆగస్టు 3: అభం శుభం తెలియని యువత ఆకర్షణకు లోనై ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత కులాల పేరుతో తమ ప్రేమను పెద్దలు అంగీకరించరనే భయం, వత్తిడి నుంచి బయట పడలేక ఓ ప్రేమజంట గూడ్సు కింద పడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం బేతంచెర్ల పట్టణం సమీపంలో చోటుచేసుకుంది. వివరాలు.. పట్టణంలోని సంజీవనగర్‌కు చెందిన కె.హుసేనయ్య, లక్ష్మిదేవి దంపతుల కుమారుడు కె.సురేంద్ర(20), స్థానిక కొత్తబస్టాండ్‌కు చెందిన రామలక్ష్మి, లక్ష్మిరెడ్డి దంపతుల కుమార్తె నిహారిక(18) గత కొంతకాలంగా ఆకర్షణకు లోనై ప్రేమించుకున్నారు. అయితే వారిలో ఏమి భయం కలిగిందో ఏమోగానీ శుక్రవారం బేతంచెర్ల నుంచి నంద్యాల వైపు వెళ్లే రైల్వే మార్గంలో గూడ్సు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పోస్టుమార్టం కోసం మృతదేహాలను బనగానపల్లె వైద్యశాలకు తరలించారు. అలాగే ఈ సంఘటనపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.