క్రైమ్/లీగల్

కట్నం వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మక్తల్, ఆగస్టు 3: అదనపు కట్నం కోసం భర్త పెడుతున్న వేధింపులు తాళలేక వివాహిత ఉరివేసుకుని తనవు ఛాలించిన ఘటన మక్తల్ మండలం కాచ్‌వార్ గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై వెంకటేశ్వర్ల కథనం ప్రకారం.. 5 సంవత్సరాల క్రితం పెద్దలు చేసిన పెళ్లితో అన్యోన్య జీవనం గడపిన వారి దాంపత్య జీవితంలో చిచ్చురేగింది. చివరికి భార్యభర్తల మధ్య వరకట్నపు పిషాచి వెంబడించి భర్త అకృత్యాలను భరించలేని ఆమహిళ ఉరివేసుకుంది. మక్తల్ పట్టణానికి చెందిన భీమమ్మ (25) అనే మహిళకు మండల పరిధిలోని కాచ్‌వార్ గ్రామానికి చెందిన బాలకిష్టయ్యగౌడ్‌తో ఐదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి రెండేళ్ల కుమారుడు ఉన్నారు. కాగా శుక్రవారం మృతురాలు భీమమ్మ భర్త అదనపు కట్నం కోసం వేధిస్తుండటంతో కాచ్‌వార్‌లోని వారి ఇంట్లోనే ఉరివేసుకొని తనువు చాలించింది. విషయాన్ని తెలుసుకున్న మక్తల్ ఎస్సై వెంకటేశ్వర్లు తమ సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని అన్ని కోణాల్లో పరిశీలించారు. మృతురాలి తండ్రి జయరాంగౌడ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.