క్రైమ్/లీగల్

మతిస్థిమితం లేని వ్యక్తిపై టీఆర్‌ఎస్ నాయకుడి దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీపనగండ్ల, ఆగస్టు 3: మండలంలోని గోపల్‌దినె్న గ్రామంలో ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరిస్తున్న సమయంలో మతిస్థిమితం లేని వ్యక్తి తనకు పింఛన్ కావాలంటూ అడగడంతో పక్కనే ఉన్న టీ ఆర్ ఎస్ నాయకుడు తాజా మాజీ సర్పంచ్ భర్త కుర్మయ్య అతనిని తోసేయడంతో బలమైన గాయాలు అయ్యాయి. గ్రామస్థుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన భాస్కర్‌గౌడ్ అనే వ్యక్తి మతిస్థిమితం లేక ఊరిలో తిరిగే వాడని గ్రామస్థులు తెలిపారు. గురువారం గ్రామ పంచాయితీ కార్యాలయంలో ప్రత్యేక అధికారిగా బాధ్యతలు స్వీకరించడానికి వచ్చిన అశోక్‌కుమార్ అక్కడే ఉన్న పంచాయతీ కార్యదర్శి మల్లికార్జున్, మాజీ సర్పంచ్ భర్త కుర్మయ్యను భాస్కర్‌గౌడ్ పింఛన్ ఇవ్వాలంటూ కోరాడు. అసభ్య పదజాలంతో కుర్మయ్యను తిడుతూ ఉండడంతో సహనం కోల్పోయిన కుర్మయ్య మంచిగా మాట్లాడాలంటూ అతనిని హెచ్చరించారు. అయినా భాస్కర్‌గౌడ్ తిడుతూనే ఉండడంతో కుర్మయ్య అతన్ని తోసేయగా పక్కనే వున్నగోడకు తగలి బలమైన గాయాలు అయ్యాయి. బాస్కర్‌గౌడ్‌తీవ్ర రక్త స్రావంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. ఈ సంఘటనను చూసిన ప్రత్యేకాధికారి, కార్యదర్శి తమకు ఏమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నట్లు ఉండిపోయారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. సంఘటన స్థలానికి చెరుకున్న ఎస్ ఐ బాధితుడి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తామని తెలిపారు.