క్రైమ్/లీగల్

మూడు ఆత్మహత్యలకు కారణమైన ఫేస్‌బుక్ ప్రేమ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జంగారెడ్డిగూడెం, ఆగస్టు 3: ఫేస్‌బుక్ ప్రేమ వ్యవహారం ముగ్గురి అత్మహత్యలకు కారణమయ్యింది. సినిమా స్టోరీని తలపించేలా సాగిన ఈ ముక్కోణపు ప్రేమ వ్యవహారం మూడు కుటుంబాలకు గుండెకోత మిగిల్చింది. వివరాల్లోకి వెళితే... జంగారెడ్డిగూడెం పోలీస్‌స్టేషన్ ఆవరణలోని పోలీస్ క్వార్టర్స్‌లో నివసిస్తున్న లక్కవరం కానిస్టేబుల్ కంపా వెంకటరమణ కుమారుడు వెంకటేష్ (23) శుక్రవారం ఉదయం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి ఫిర్యాదుమేరకు జంగారెడ్డిగూడెం ఎస్సై అల్లు దుర్గారావు అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేశారు.
అయితే ఈ ఆత్మహత్య వెనుక ఆశ్చర్యంగొలిపే కథనం ఒకటి వినిపిస్తోంది... ఒక వివాహితతో వెంకటేష్‌కు ఏర్పడిన ఫేస్‌బుక్ పరిచయం ప్రేమకు దారితీసి, మూడు ఆత్మహత్యలకు కారణమయ్యిందనేది ఈ కథనం సారాంశం. వివరాల్లోకి వెళితే... ఐటీఐ చదివి ఖాళీగా ఉంటున్న వెంకటేష్‌కు కొంతకాలం క్రితం ఫేస్‌బుక్‌లో బిందు అనే యువతితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమకు దారితీసింది. వెంకటేష్‌కు పరిచయమయ్యే నాటికే బిందుకు కొవ్వూరుకు చెందిన సాయి అనే యువకుడితో ప్రేమవివాహమయ్యింది. వారిరువురు రాజమహేంద్రవరంలో కొంత కాలం కాపురం చేశారు. అయితే తర్వాత చిన్న చిన్న మనస్పర్థలతో వారిరువురు విడివిడిగా ఉంటున్నారు. బిందు తన పుట్టిల్లు అయిన జంగారెడ్డిగూడెం మండలంలోనే ఉండేదని తెలిసింది. ఆ సమయంలోనే వెంకటేష్‌కు ఆమెతో పరిచయం ఏర్పడింది. కాగా వెంకటేష్ కొంత కాలం క్రితం బిందు భర్త సాయికి ఫోన్‌చేసి, ఆమెకు విడాకులిస్తే, తాను ఆమెను వివాహం చేసుకుంటానని కోరాడని సమాచారం. ప్రేమించి పెళ్లిచేసుకున్న భార్య ప్రవర్తనతో విసిగివున్న సాయి వెంకటేష్ ఫోన్‌కాల్‌తో మరింత మనస్తాపానికి గురయ్యాడు. దీనితో రెండు నెలల క్రితం సాయి రాజమహేంద్రవరంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్టు తెలిసింది. కాగా నెల రోజుల క్రితం జంగారెడ్డిగూడెం వచ్చిన బిందు వెంకటేష్ కలిసి బైక్‌పై రాజమహేంద్రవరం బయల్దేరారు. ఆ సమయంలోనే వారిరువురి మధ్య మాటామాటా పెరిగింది. నీవల్లే నా భర్త ఆత్మహత్య చేసుకున్నాడని బిందు నిలదీయడంతో వారిరువురి మధ్య వాగ్వాదం జరిగినట్టు సమాచారం. కొవ్వూరు రోడ్ కం రైలు వంతెన మీదకు వెళ్ళిన తరువాత ఇద్దరూ చనిపోవాలని నిర్ణయించుకున్నారు. వంతెనపై బైక్ ఆపడం, బిందు గోదావరిలోకి దూకేయడం క్షణాల్లో జరిగిపోయింది. వెంకటేష్ కూడా గోదావరిలోకి దూకే ప్రయత్నం చేయగా రోడ్డు వెంట వెడుతున్నవారు వారించారని పోలీసుల ద్వారా తెలిసింది. ప్రేమించిన యువతి ఆత్మహత్యకు పాల్పడటంతో తీవ్ర మనస్తాపానికి గురైన వెంకటేష్ పలుమార్లు ఆత్మహత్య చేసుకుంటాననడంతో కుటుంబ సభ్యులు జాగ్రత్తగా చూసుకుంటున్నారు. శుక్రవారం తండ్రి వెంకటరమణ లక్కవరం పోలీసు స్టేషన్‌కు విధి నిర్వహణకు వెళ్లగా, తల్లి కూరగాయల కోసం ఉదయం 11 గంటలకు బయటకు వెళ్లారు. 12 గంటలకు తల్లి ఇంటికి తిరిగివచ్చేసరికి వెంకటేష్ ఇంటిలో ఫ్యాన్ హుక్కుకు ఉరివేసుకుని కనిపించాడు. దీనితో అతని కుటుంబ సభ్యులు కుప్పకూలిపోయారు. మొత్తానికి ఫేస్‌బుక్ ప్రేమ వ్యవహారం ముగ్గురి ఆత్మహత్యలకు కారణమయ్యింది.