క్రైమ్/లీగల్

మద్యం సేవించి వాహనాలు నడిపిన 46 మందికి జైలు శిక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, ఆగస్టు 3: జిల్లాలో మద్యం సేవించి వాహనాలు నడిపిన మొత్తం 46 మంది వాహన చోదకులకు కోర్టు జైలుశిక్ష విధించింది. అదేవిధంగా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో మొత్తం 5లక్షల 62వేల 100 రూపాయలు కోర్టు జరిమానా విధించినట్లు ఒంగోలు ట్రాఫిక్ పోలీసు స్టేషన్ డిఎస్‌పి కె వేణుగోపాల్ శుక్రవారం తెలిపారు. జిల్లా వాసుల్లో కొందరు మద్యం సేవించి వాహనాలు నడిపి ప్రమాదాల పాలవుతున్నట్లు తెలిపారు. దీని వలన జరిగే ప్రాణ, వ్యక్తిగత, ఆస్తి నష్టాలను అరికట్టాలన్న ఉద్దేశంతో ఎస్‌పి బి సత్య ఏసుబాబు ఆదేశాల మేరకు జిల్లా పోలీసు అధికారులు వారి వారి ఇలాఖాలోని ప్రదేశాల్లో గత నెల 27 నుండి ఈనెల 3 వరకు వాహన చోదకులకు డ్రంకన్ డ్రైవ్‌పై తనిఖీలు నిర్వహించినట్లు డిఎస్‌పి తెలిపారు. ఆ తనిఖీల్లో 216 మందిని మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న వారిగా గుర్తించి, వారిపై ఎంవి యాక్ట్ సెక్షన్ 185 (ఎ) ప్రకారం కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. వారితోపాటుగా పెండింగ్‌లో ఉన్న 321 మందిని కోర్టులోహాజరుపరచగా, వీరిలో 46 మంది వ్యక్తులకు జైలు శిక్ష, మిగిలిన వారికి జరిమాన విధించినట్లు తెలిపారు. ఈ డ్రంకన్ డ్రైవ్ కేసుల్లో రూ.5,62,100 రూపాయలు కోర్టు వారు జరిమానాగా విధించినట్లు డిఎస్‌పి వేణుగోపాల్ తెలిపారు.