క్రైమ్/లీగల్

గూడ్స్‌రైలు కిందపడి విద్యార్థి దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కురిచేడు, ఆగస్టు 3: స్థానిక ప్రైవేటు పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థి శుక్రవారం గూడ్స్‌రైలు కిందపడి దుర్మరణం చెందిన సంఘటన కురిచేడు రైల్వేస్టేషన్ సమీపంలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని అలవలపాడు గ్రామానికి చెందిన మనె్నం కోటయ్య కుమారుడు వెంకటరావు (16) కురిచేడులోని సెయింట్ జోసఫ్ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్నాడు. పాఠశాల పరిధిలోని హాస్టల్‌లో ఉంటూ విద్యాభ్యాసం చేస్తున్నాడు. కాగా, సదరు విద్యార్థి గురువారం రాత్రి నుంచి కనిపించడం లేదని సహచర విద్యార్థులు పేర్కొంటున్నారు. శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో గూడ్స్‌రైలు కిందపడి మృతిచెంది ఉండగా పాఠశాల యాజమాన్యం దృష్టికి తీసుకువచ్చారు. యాజమాన్యం ఈవిషయాన్ని తల్లిదండ్రులకు తెలియచేశారు. ఏ కారణంచేత విద్యార్థి మృతిచెందాడో వివరాలు తెలియలేదు. నరసరావుపేట జిఆర్‌పి పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నరసరావుపేటకు తరలించారు.