క్రైమ్/లీగల్

కబ్జా రాయుళ్ల అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవరకొండ, ఆగస్టు 3: మున్సిపల్ సిబ్బంది సహకారంతో పట్టణంలోని పఠాన్‌వాడీలో ఓ ఇంటిని కబ్జా చేసి అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన కేసులో దేవరకొండకు చెందిన నలుగురు వ్యక్తులను శుక్రవారం కోర్టుకు హాజరుపర్చి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ ఎంజీఎస్ రామకృష్ణ చెప్పారు. ఈ కేసులో మొత్తం నలుగురు మున్సిపల్ సిబ్బందితో సహా మొత్తం 10 మందిపై కేసు నమోదు చేయగా నలుగురిని అరెస్ట్ చేశామన్నారు. మిగిలిన ఆరుగురు నిందితులు పరారీలో ఉన్నారన్నారు. కేసుకు సంబంధించిన వివరాలను సీఐ రామకృష్ణ వివరించారు. దేవరకొండలో రెండో వార్డుకు చెందిన మహ్మద్ నసీర్ అనే వ్యక్తి జీవనోపాధి నిమిత్తం హైద్రాబాద్‌కు వెళ్ళగా అతని ఇల్లు శిథిలావస్థకు చేరడంతో అతని ఇంటిని కబ్జా చేసేందుకు పట్టణానికి చెందిన మహ్మద్ సాధిక్ అనే వ్యక్తి ఆక్రమించుకున్నాడు. మున్సిపల్ సిబ్బంది సహకారంతో రివిజన్ రికార్డులో ఇంటి యజమానిగా తన పేరును నమోదు చేయించుకున్నాడు. తర్వాత స్థలాన్ని తన అనుచరులైన మహ్మద్ అయ్యూబ్ అలీ, మహ్మద్ అబ్దుల్ వసీ, మహ్మద్ షకీల్ పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేయించాడు. అనంతరం స్థలాన్ని అమ్మి సొమ్ము చేసుకోవాలని కుట్ర పన్నాడు. ఈ క్రమంలో ఇంటి యజమాని ఎండీ నసీర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపి ఈ కేసులో నిందితులు సాధిక్, అయ్యూబ్ అలీ, అబ్దుల్ వసీ, షకీల్‌లను అరెస్ట్ చేసి శుక్రవారం కోర్టులో రిమాండ్ చేశామని సీఐ రామకృష్ణ తెలిపారు. పరారీలో ఉన్న మిగిలిన ఆరుగురిని కూడా త్వరలో అరెస్ట్ చేసి కోర్టులో రిమాండ్ చేస్తామని చెప్పారు. విలేఖరుల సమావేశంలో ఎస్‌ఐ సర్దార్ తదితరులు పాల్గొన్నారు.