క్రైమ్/లీగల్

తల్లికి విషంతాగించి... తానుతాగి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జనగామ టౌన్, ఆగస్టు 3: తల్లి మృతి చెందితే తలకొరివి పెట్టాల్సిన చిన్నకుమారుడే ఆమె పాలిట యముడయ్యా డు. క్రిమిసంహారక మందు తాగించి ప్రాణంతీసి, తానూ విషం సేవించి ఆత్మహత్యకు పాల్పడిన విషాద సంఘటన జనగామ మండలం పెద్దపహడ్ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. పెద్దపహడ్ గ్రామానికి చెందిన పోతుల శ్రీశైలం(50) తన తల్లి పోతుల ఉప్పలమ్మ(80)కు బలవంతంగా క్రిమిసంహారక మందు తాగించి ప్రాణం తీశాడు. అనంత రం అతనూ తల్లికి తాగించగా మిగిలిన క్రిమిసంహారక మందును తానూతాగి అపస్మారక స్థితిలో ఉం డగా బంధువులు వరంగల్‌కు తరలించగా చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందాడు. దాచుకున్న డబ్బులు ఇవ్వాలని తల్లితో శ్రీశైలం ప్రతి రోజు గొడవపడేవాడు. ఈ విషయంలో గత వారం రోజులుగా వారి మధ్య గొడవలు తీవ్రమయ్యాయి. శ్రీశైలం మద్యం సేవించి కుటుంబ సభ్యులను రోజూ ఇబ్బందులకు గురిచేసేవాడు. ఈ క్రమంలో శుక్రవారం మద్యం అధికంగా తాగి ఇంటికి వచ్చి తల్లి ఉప్పలమ్మ నోటిలో బలవంతంగా క్రిమిసంహారక మందుపోయగా ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. అనంతరం క్రిమిసంహారక మందు తాగి ఇంట్లో పడిపోగా ఆలస్యంగా చూసిన బంధువులు అతడిని వరంగల్ ఎంజీఎంకు తరలిస్తుండగా చికిత్స పొం దుతూ మృతిచెందాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న జనగామ సీఐ శ్రీనివాస్ గ్రామానికి వెళ్లి సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.