క్రైమ్/లీగల్

పరారీలో నర్సింగ్‌హోం యజమాని?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నర్సంపేట, ఆగస్టు 3: నర్సంపేట పట్టణంలోని నెక్కొం డ రోడ్‌కు చెందిన ఓ నర్సింగ్ హోం (ప్రైవేట్ ఆసుపత్రి) యజమాని కొంత మంది వద్ద రూ.2కోట్ల పైచీలుకు అప్పు చేసి పరారు అయినట్లు తెలిసింది. అత్యంత విశ్వసనీయ వర్గాలు అందించిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి... చెన్నారావుపేట మండలంలోని ఖాదర్‌పేటకు చెందిన సోదరులిద్దరూ రెండు దశాబ్దాల క్రితం నర్సంపేటకు వచ్చి స్థిరపడ్డారు. ఈ క్రమంలో అన్న ఓ మెడికల్ షాపులో గుమస్తాగా చేరి దానిపై పట్టు సాధించాడు. కొంత కాలం తర్వాత నర్సంపేట పట్టణంలోనే ఓ మెడికల్ షాపు ఏర్పాటు చేశాడు. తన సోదరుడిని సైతం ఇదే రం గంలోకి దించాడు. మూడేళ్ల క్రితం నెక్కొండ రోడ్‌లో ఓ భవనాన్ని నిర్మించి అందులో ప్రైవేట్ నర్సింగ్‌హోంను స్థాపించి వరంగల్, హైద్రాబాద్‌కు చెందిన డాక్టర్లను తీసుకవచ్చి వారితో వైద్యం చేయించసాగాడు. అనతి కాలంలోనే మూడు మెడికల్ షాపులను ఏర్పాటు చేసి అందులో రెండింటిని ఇతరులకు విక్రయించాడు. తాను నెలకొల్పిన నర్సింగ్‌హోంకు నిత్యం పదుల సంఖ్యలో రోజు రోజుకు పేషంట్ల తాకిడి పెరిగిపోయింది. ఇదే సమయంలో పలువురిని తన మాటలతో మచ్చిక చేసుకుని, అధిక వడ్డీ ఆశ చూపి చెన్నారావుపేట, నర్సంపేట, నెక్కొండ మండలాలకు చెందిన పలువురి వద్ద లక్ష నుండి పది లక్షల రూపాయల వరకు అప్పుగా తీసుకున్నట్లు సమాచారం. ఐదు రోజులుగా నర్సింగ్‌హోం తెరచుకోకపోవడం.. వైద్యం కోసం పరిసర గ్రామాలకు చెందిన పేషంట్లు వచ్చి తిరిగిపోతుండడంతో నర్సింగ్ హోంకు ఎందుకు మూతపడిందంటూ ఆరా తీశారు. ఐదు రోజుల నుండి నర్సింగ్‌హోంకు తెరుచుకోకపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చింది. దీంతో అసలు విషయం వెలుగు చూసింది. నర్సింగ్ హోం యజమాని రూ.2 కోట్ల పైచీలుకుతో ఉడాయించారనే వార్త నర్సంపేట డివిజన్‌లో శుక్రవారం దావనంలా వ్యాపించింది. అప్పు ఇచ్చిన వారు వచ్చి సెల్ ఫోన్‌కు ఫోన్ చేస్తే స్విచ్ఛ్ఫా రావడంతో వారు లబోదిబోమని మొత్తుకున్నారు. స్థానికంగా ఉన్న అతని సోదరుడి వద్దకు వెళ్లి మీ అన్న ఎక్కడ ఉన్నారు.. మా వద్ద అప్పు తీసుకున్నాడు.. మా డబ్బులు మాకు కావాలని వేడుకున్నట్లు తెల్సింది. అయితే తనకు ఏమీ తెలియదని, తాను సైతం ఫోన్ చేస్తే స్విచ్ఛ్ఫా వస్తోందని సోదరుడు చెబుతుండడంతో అప్పు ఇచ్చిన వారికి పాలుపోలేని పరిస్థితి నెలకొంది. ప్రైవేట్ చిట్టిలతో పాటు రిజిష్టర్ చిట్టీలను సైతం ఎత్తుకున్నట్లు తెలియవచ్చింది. నర్సింగ్‌హోం యజమానికి అప్పు ఇచ్చిన వారి సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.