క్రైమ్/లీగల్

ఇంటికి కన్నాలు వేసి చోరీలు చేసే దొంగ అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, ఆగస్టు 3: నగరంలో ఇళ్లకు కన్నాలు వేసి దొంగతనాలకు పాల్పడుతూ పోలీసుల కళ్లుగప్పి తప్పించుకు తిరుగుతున్న నిందితుడిని నెల్లూరు క్రైం బ్రాంచ్, సంతపేట పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను క్రైం బ్రాంచ్ డీఎస్పీ బాలసుందరరావు శుక్రవారం తన కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. నెల్లూరు ఈద్గామిట్టకు చెందిన షేక్ అక్బర్ ఎవరూ లేని ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పతున్నాడు. నగరంలోని కుక్కలగుంట, మన్సూర్‌నగర్, పాత మున్సిపల్ ఆఫీసు తదితర ప్రాంతాల్లో గడచిన ఏడాదికాలంలో పలు చోరీలకు పాల్పడ్డాడు. అతనికోసం పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచారు. ఈ క్రమంలో గురువారం ఉదయం స్థానిక ములుమూడి బస్టాండ్ ప్రాంతంలో ఉన్న అక్బర్‌ను క్రైం బ్రాంచ్ సీఐ బాజీజాన్‌సైదా, సంతపేట సీఐ బి.పాపారావు నేతృత్వంలో ఎస్సై మురళీ ప్రసాద్, హెడ్ కానిస్టేబుళ్లు సురేష్‌కుమార్, మహేశ్వరరావు, కానిస్టేబుళ్లు రాజేష్, ప్రభాకర్, శ్రీనివాసులు, సాయిఆనంద్‌లు ఒక ప్రత్యేక బృందంగా ఏర్పడి అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో అతని నుండి రూ.2లక్షల విలువచేసే బంగారు, వెండి ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరుపరుస్తామని, నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన పోలీసులను అభినందించి రివార్డులకు సిఫార్సు చేస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో సీఐ బాజీజాన్‌సైదా, ఎస్సై మురళీప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.