క్రైమ్/లీగల్

ఆసుపత్రిలో దొంగలు పడ్డారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బుచ్చిరెడ్డిపాళెం, ఆగస్టు 3 : ప్రభుత్వ ఆసుపత్రిలో దొంగలు పడి కొన్ని వస్తువులు అపహరించిన సంఘటన బుచ్చిరెడ్డిపాళెం మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండలంలోని జొన్నవాడ గ్రామంలో గల ప్రభుత్వ ప్రాథమిక వైద్యశాలలో గురువారం అర్ధరాత్రి దాటాక దుండగులు ప్రధాన గేటు తాళాలు పగులకొట్టి లోపలికి జొరబడ్డారు. మందుల విభాగానికి చెందిన గది తాళాలు కూడా పగులకొట్టి ఆ గదిలో గల స్టోర్‌రూం, సీనియర్ సహాయకుని రూం తాళాలు అపహరించారు. అనంతరం ఆయా గదుల్లోకి ప్రవేశించి అక్కడ ఉన్న బీరువా తాళాలు పగులకొట్టి అందులోని బయోమెట్రిక్ పరికరం, వేయింగ్ మిషన్, డాక్టర్లు ఉపయోగించే స్టెతస్కోప్, కంప్యూటర్‌కు చెందిన వైపై రూటర్‌లను అపహరించుకెళ్లారు. ఈ మేరకు ఆ వైద్యశాల అధికారి డాక్టర్ ఖాదర్‌బాషా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో సంఘటనా స్థలాన్ని ఎస్‌ఐ ప్రసాద్‌రెడ్డి పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.