క్రైమ్/లీగల్

పూడ్చిన శవానికి పోస్టుమార్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బనగానపల్లె, ఆగస్టు 4:బనగానపల్లె పోలీస్ స్టేషన్ పరిధిలోని యనకండ్ల గ్రామానికి చెందిన బాషా(7) గత ఏపిల్ 25వ తేదీ విద్యుదాఘాతంతో మృతి చెందగా గ్రామానికి చెందిన గోపాల్ ఫిర్యాదు మేరకు తాము శనివారం పూడ్చిపెట్టిన శవానికి పోస్టుమార్టం చేయించినట్లు సీఐ సురేష్‌కుమార్‌రెడ్డి తెలిపారు. గ్రామస్థుడు ఫిర్యాదు చేయడంతో తాము తహశీల్దార్ శివరామిరెడ్డి, డా. శివశంకర్‌తో కలిసి గ్రామానికి వెళ్లి పూడ్చిన శవాన్ని వెలికి తీయించి పోస్టుమార్టం నిర్వహించామన్నారు. అప్పట్లో తండ్రి పక్కీర్‌బాషా తమ దృష్టికి తీసుకురాకపోవడంతో వారు పోలీసులకు తెలియకుండా అంత్యక్రియలను వారి ఆచారం ప్రకారం నిర్వహించారని తెలిపారు.