క్రైమ్/లీగల్

27న లుంబినీ, గోకుల్‌చాట్ పేలుళ్ల ఘటనపై కోర్టు తీర్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 7: హైదరాబాద్ నడిబొడ్డున లుంబినీ పార్కు, గోకుల్‌చాట్‌లో జరిగిన బాంబు పేలుళ్ల సంఘటనపై నిందితులకు ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు శిక్షలను ఖరారు చేయనుంది. 2007 ఆగస్టు 25వ తేదీన జంట పేలుళ్లు సంభవించాయి. ఈ సంఘటనకు సంబంధించిన అంశాలను ఈ నెల 12వ తేదీన ఎన్‌ఐఏ పూర్తి నివేదికను ప్రత్యేక కోర్టుకు అందివ్వనున్నది. ఈనెల 27వ తేదీన ప్రత్యేక కోర్టు తీర్పును ప్రకటించనుంది. 2007 ఆగస్టు 25వ తేదీన రాత్రి 7.45 సమయంలో లుంబినీ పార్కులో, 7.50 సమయంలో గోకుల్‌చాట్‌లో బాంబు పేలుళ్ళ జరిగాయి. 5 నిమిషాల వ్యవధిలో జరిగిన ఈ పేలుళ్లలో 42 మంది మృతి చెందారు. 54 మందికి తీవ్రగాయాలయ్యాయి. సంఘటనలో అనేక మంది కంటి చూపుకోల్పోయారు. రెండు సంఘటనల్లో టిన్ బాంబులు ఉపయోగిచింనట్లు దర్యాప్తులో తేలింది. టిన్ బాంబుల్లో స్టీల్‌బాల్స్‌ను ఉగ్ర ముష్కరులు వాడినట్లు విచారణలో బయటపడింది. ఈ సంఘటనకు పాకిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఉగ్రవాదులే కారణమని అప్పటి ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డికి నిఘా వర్గాలు వెల్లడించాయి. ఈ పేలుళ్లు అప్పట్లో జంటనగర వాసుల్లో భయభ్రాంతులకు గురిచేశాయి.