క్రైమ్/లీగల్

బ్యాంకు దొంగలు దొరికారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం సిటీ, ఆగస్టు 11: అనంతపురం నగరంలోని జేఎన్‌టీయూ ఆవరణలో ఉన్న ఎస్‌బీఐలో రూ.37 లక్షలు ఎత్తుకెళ్లిన దొంగల్లో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. హర్యానా, రాజస్థాన్‌కు చెందిన ఐదుగురు దొంగలు ఈ చోరీలో పాల్గొన్నట్లు నిర్ధారణకు వచ్చిన పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపాయి. వీరిలో హర్యానాకు చెందిన అనిల్‌కుమార్ పన్వార్(38), రాజస్థాన్‌కు చెందిన దేవనారాయణ్ గుజ్జర్ (25)ను 8వ తేదీ అరెస్టు చేసి అనంతపురం తీసుకొచ్చారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. వీరి నుంచి రూ. 10.58 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎఎస్పీ మాల్యాద్రి తెలిపారు. శనివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ గతనెల 27వ తేదీ ఎస్‌బీఐలోని లాకర్‌ను గ్యాస్ సిలిండర్‌తో కోసి రూ. 39.13 లక్షల నగదు ఎత్తికెళ్లారన్నారు. జిల్లా ఎస్పీ అశోక్‌కుమార్ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన ప్రత్యేక బృందాలను హర్యానా, రాజస్థాన్‌కు పంపామన్నారు. ముఠాలోని హర్యానా రాష్ట్రం గుర్గావ్ జిల్లా భోన్సీ గ్రామానికి చెందిన అనిల్‌కుమార్ పన్వార్ (38), రాజస్థాన్ రాష్ట్రం అక్షరధామ్‌కు చెందిన దేవనారాయణ్ గుజ్జర్ (25)ను ఈనెల 8వ తేదీ అరెస్టుచేశామన్నారు. వీరి నుంచి 10.58 లక్షల నగదు, ఒక హ్యూందాయ్ కారు స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ ముఠా బ్యాంకులో చోరీకి బెంగళూరులోని ఓ లాడ్జిలో పథకం రూపొందించిందన్నారు. చోరీకి అవసరమైన సామగ్రి బెంగళూరులో కొనుగోలు చేసి కారులో గతనెల 27వ తేదీ రాత్రి అనంతపురం చేరుకుని బ్యాంకులోకి చొరబడి గ్యాస్‌కట్టర్‌తో లాకర్ తెరిచి డబ్బు ఎత్తుకెళ్లారన్నారు. అనంతరం బెంగళూరు వెళ్లి అక్కడి నుంచి స్వగ్రామాలకు చేరుకున్నారన్నారు. రూ. 6 లక్షల నోట్లు కాలిపోవడంతో బెంగళూరు సమీపంలో పడేశారన్నారు. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలింపు తీవ్రతరం చేశామన్నారు.