క్రైమ్/లీగల్

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గూడూరు, ఆగస్టు 12:మండల పరిధిలోని మునగాల గ్రామానికి చెందిన రైతు బోయ హనుమంతు(35) అప్పుల బాధలు తాళలేక ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాలు.. హనుమంతుకు గ్రామంలో మూడెకరాల భూమి ఉండగా అందులో ఈ ఏడాదిలో పత్తి పంట సాగు చేశాడు. అయితే భూమిలో విత్తనం వేసిన రోజు నుంచి నేటి వరకూ వర్షం జాడే లేకపోవడంతో సాగు చేసిన పంట ఎండిపోయింది. ఏటా వ్యవసాయంపై పెట్టిన పెట్టుబడులు చేతికందకపోవడంతో అప్పుల భారం పెరిగిపోయింది. దీంతో రుణదాతల నుంచి వత్తిళ్లు పెరగడంతో తీవ్ర మనస్థాపానికి గురైన హనుమంతు శనివారం రాత్రి ఇంట్లో అందరూ నిద్రిస్తున్న సమయంలో పురుగుల మందు తాగాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హనుమంతును హుటాహుటిన కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే రైతు చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతిచెందాడు. ఇతడికి భార్య వీరమ్మ, కొడుకు, కూతురు ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.