క్రైమ్/లీగల్

దారిదోపిడీ దొంగల ముఠా అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు (పట్నంబజారు), ఆగస్టు 13: గుంటూరు నగరంతో పాటు పలు ప్రాంతాల్లో దారిదోపిడీలకు పాల్పడుతున్న ఐదుగురు సభ్యులు గల దొంగలముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం ఈ మేరకు అర్బన్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఎస్‌పి విజయారావు నిందితుల వివరాలను తెలియజేశారు. మహబూబ్ నగర్ జిల్లా ఫకీర్ తండాకు చెందిన భూక్యా నరేష్, గుగులోత్ నరేష్, బూక్యా కోటయ్య, గుగులోతు రమేష్, భూక్యా రమేష్ ముఠాగా ఏర్పడి బస్టాండ్, ఇతర రద్దీగా ఉండే ప్రాంతాల్లో నేరాలకు పాల్పడుతున్నారు. గత నెల 11వ తేదీన గుంటూరు కళామందిర్ షోరూమ్‌లో ఇన్‌ఛార్జిగా పనిచేస్తున్న వెంకట రామ్‌కుమార్ 103 పట్టుచీరలను మూడుపార్శిల్స్‌లో పెట్టి విశాఖపట్నం పంపేందుకు బస్టాండ్‌లో పార్శిల్ కార్యాలయ సిబ్బందికి వివరాలు తెలియజేసి బస్సులో పార్శిల్ పెట్టించారు. అయితే ఆ పార్శిల్ పది రోజులు అయినప్పటికీ విశాఖపట్నంకు చేరుకోలేదు. ఎవరో చోరీ చేశారని నిర్ధారించుకున్న వెంకట రామ్‌కుమార్ పాత గుంటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిఐ శ్రీనివాసరావు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సీసీ ఫుటేజీ ఆధారంగా దొంగలు తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లా, ఫకీర్ తండాకు చెందిన వారుగా తెలుసుకుని సిసిఎస్ సిఐ టి రత్నస్వామి, పాత గుంటూరు సిఐ శ్రీనివాసరావు, కొత్తపేట ఎస్‌ఐ సుబ్బారావు, పోలీసుకానిస్టేబుళ్లు బాలాజీకిషోర్, బాలస్వామి ఆ ప్రాంతానికి వెళ్లి నిందితులను అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుండి 10 లక్షల రూపాయల విలువ చేసే పట్టుచీరలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేయడంలో ప్రతిభకనబర్చిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్‌పి అభినందించారు.