క్రైమ్/లీగల్

బాలనేరస్తుడు అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, ఆగస్టు 13: జిల్లాలో వివిధ చోరీలకు పాల్పడుతున్న బాలనేరస్తుడితోపాటు బాల నేరస్తుడి నుండి దొంగ సొత్తును స్వీకరించిన పులగాల అవినాష్ అనే వ్యక్తిని ఒంగోలు వన్‌టౌన్ పోలీసులు సోమవారం ఒంగోలోని సివియన్ రీడింగ్ రూం వద్ద అరెస్ట్ చేసినట్లు డిఎస్‌పి బి శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం స్థానిక ఒంగోలు వన్‌టౌన్ పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో డిఎస్‌పి శ్రీనివాసరావు మాట్లాడుతూ వారి ఇరువుని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి సుమారు 4 లక్షల రూపాయల చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్‌పి తెలిపారు. ఈ కేసు పూర్వాపరాల గురించి డిఎస్‌పి శ్రీనివాసరావు వివరిస్తూ బాలనేరస్తుడు ప్రకాశం జిల్లా, ఒంగోలు దేవుడు చెరువుకి చెందిన వాడు కాగా, బాలనేరస్తుడు నుండి చోరీ సొత్తును స్వీకరించిన వ్యక్తిది ఒంగోలులోని భాగ్యనగర్ 2వ లైన్‌కి చెందిన పులగాల అవినాష్‌గా డిఎస్‌పి తెలిపారు. నేరం చేసే విధానం గురించి డిఎస్‌పి వివిరిస్తూ పైన తెలిపిన బాలనేరస్తుడు రాత్రివేళల్లో ప్రజలు నిద్రించు సమయంలో వారి ఇంటిలోకి ప్రవేశించి బంగారు వస్తువులు, మోటారు సైకిళ్లు, మోటారుసైకిళ్లకు అమర్చిన చక్రాలు దొంగిలించి ఆ దొంగిలించిన సొత్తుతో జల్సాలు చేస్తున్నట్లు డిఎస్‌పి తెలిపారు. ఈ క్రమంలో ఈనెల 3న రాత్రి ఒంగోలులోని రాజాపానగల్ రోడ్డులో తలుపులు తెరచి నిద్రిస్తున్న ఇంట్లోకి ప్రవేశించి బీరువాలోని సుమారు 11 సవర్ల బంగారు ఆభరణాలు దొంగిలించి పైన తెలిపిన అవినాష్ అనే వ్యక్తికి విక్రయించి వాటితో వచ్చిన డబ్బుతో జల్సాలకు వాడుకున్నట్లు డిఎస్‌పి తెలిపారు. గత కొద్దికాలంగా ఒంగోలు రాత్రివేళల్లో మోటారు సైకిళ్లు, వాటి చక్రాలను దొంగిలిస్తున్న వింత దొంగలు గురించి పట్టుకొనేందుకు ఎస్‌పి ఉత్తర్వుల మేరకు తన పర్యవేక్షణలో ఒంగోలు వన్‌టౌన్ సీఐ యండి ఫిరోజ్, ఎస్‌ఐ నాయబ్ రసూల్,వారి పోలీసు సిబ్బందితో ఒక స్పెషల్ టీమ్‌ను ఏర్పాటు చేయగా సోమవారం ఒంగోలులో వారిని అరెస్ట్ చేసినట్లు డిఎస్‌పి తెలిపారు. బాలనేరస్తుడు, అవినాష్ నుండి 11 సవర్ల బంగారు ఆభరణాలు, రెండు మోటారు సైకిళ్లు, 8 మోటారు సైకిళ్ల చక్రాలు మొత్తం కలిపి 4 లక్షల విలువ కలిగిన చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్‌పి తెలిపారు. బాలనేరస్తుడు నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్న పోలీసు సిబ్బందిని ఎస్‌పి సత్య ఏసుబాబు అభినందించినట్లు డిఎస్‌పి తెలిపారు. ఇదిలా ఉండగా బాలనేరస్తుడిని జువనైల్ హోంకు తరలించినట్లు తెలిపారు.