క్రైమ్/లీగల్

పదిలక్షల రూపాయల విలువైన ఎర్రచందనం పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మద్దిపాడు,ఆగస్టు 13: సుమారు పదిలక్షల రూపాయల విలువైన ఎర్రచందనం దుంగలను స్థానిక ఎస్‌ఐ పి సురేష్ తమ సిబ్బందితో పట్టుకున్న సంఘటన ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ఒంగోలు డిఎస్‌పి బి శ్రీనివాసరావు సోమవారం విలేఖర్ల సమావేశాన్ని నిర్వహించి వివరాలను వెల్లడించారు. ఈనెల 12వతేదీ సాయంత్రం ఎస్‌ఐ సురేష్ తన సిబ్బందితో గుండ్లాపల్లి గ్రోత్‌సెంటర్ నుండి నాగులుప్పలపాడు రోడ్డులోగల ఆర్‌కె పౌల్ట్రీ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ నేపధ్యంలో టాటా ఎసి వాహనాన్ని తనిఖీచేయగా ఆ వాహనంలో ఎర్రచందనం దుంగలు ఉన్నట్లు సిబ్బంది గుర్తించారు. ఎస్‌ఐ సంబంధిత ఎర్రచందనానికి సంబంధించిన అనుమతి పత్రాలను వాహన డ్రైవరు కావూరి ఏసోబును ప్రశ్నించగా ఎలాంటి అనుమతి పత్రాలు లేవని దీంతో ఎస్‌ఐ వీరిని వాహనంతో స్థానిక స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా డ్రైవర్‌ను విచారించగా ఎర్రచందనం దుంగలను సేకరించి వాటిని లింగంగుంట గ్రామానికి చెందిన ఎస్ నాగేశ్వరరావు, రాచపూడికి చెందిన జాన్ అనే వ్యక్తుల ద్వారా మద్రాసుకు చెందిన ఇస్మాయిల్‌కు కిలోల లెక్కన గతంలో అమ్మినట్లు, ఇవి కూడా అమ్మకానికి తీసుకువస్తున్నారని తెలిపారు. వీటి బరువు సుమారు వెయ్యికేజిల వరకు ఉండి పదిలక్షల రూపాయల వరకు విలువ ఉంటుందని డిఎస్‌పి తెలిపారు. ఈ కేసును పట్టుకున్న స్థానిక ఎస్‌ఐ సురేష్, హెడ్‌కానిస్టేబుల్ రమణారెడ్డి, కానిస్టేబుల్ అంకమ్మరావు, కిశోర్, రాములు తదితరులను డిఎస్‌పి అభినందించారు.