క్రైమ్/లీగల్

రూ.3 కోట్ల విలువైన పంచలోహ విగ్రహాలు స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఆగస్టు 24: దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న 13 మంది దొంగలను అరెస్ట్ చేసి 3 కోట్ల రూపాయల విలువైన పురాతన పంచలోహ విగ్రహాలను గుంటూరు రూరల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం రూరల్ ఎస్‌పి కార్యాలయంలో రూరల్ జిల్లా అడిషనల్ ఎస్‌పి ఎం వెంకటేశ్వర్లు మీడియాకు వివరాలు వెల్లడించారు. గత ఏడాది చుండూరు పోలీసు స్టేషన్‌లో నమోదైన పంచలోహ విగ్రహాల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. తెనాలికి చెందిన ఆరాద్యుల శివనాగరాజు, కుర్రా మణికంఠ, కుర్రా జస్వంత్, గుళ్లపల్లి మహేష్‌కుమార్, భద్ర గోపి, కొల్లూరు మండలం, గాజులంకకు చెందిన కొక్కిలగడ్డ సైదులు, నగరం మండలానికి చెందిన గుంటూరు ప్రభు, ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన దూదేకుల ఖాశింవలి, ఎస్‌కె సుభాని, ఎస్‌కె మహబూబ్, షబ్బీర్ బాషా, అదే జిల్లా చీమకుర్తికి చెందిన ఎస్‌కె మీరావలి, ఎస్‌కె ఖాదర్‌బాషాలు దేవాలయాల్లో దొంగతనాలకు పాల్పడుతుంటారు. చుండూరు పోలీసుస్టేషన్‌లో నమోదైన కేసును దర్యాప్తు నిర్వహించిన క్రమంలో వీరందరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి 10 పంచలోహ విగ్రహాలు, ఒక పాదర కుచేరయంత్రం, ఒక నాగారం, నేరాలకు ఉపయోగించే రెండు వాహనాలు, ఏడు సెల్‌ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు. కేసులో ప్రతిభ కనబర్చిన క్రైం సిబ్బందిని ఎస్‌పి సిహెచ్ వెంకట్ అభినందించి, రివార్డులు ప్రకటించారు. విలేఖర్ల సమావేశంలో రూరల్ జిల్లా క్రైం డిఎస్‌పి లక్ష్మీపతి, సిఐ టి విజయకృష్ణ, చుండూరు సిఐ బి రమేష్, ఎస్‌ఐ రోశయ్య తదితరులు పాల్గొన్నారు.