క్రైమ్/లీగల్

నాకీ తండ్రి వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మికుంట, ఫిబ్రవరి 23: కన్న కొడుకుపై కనికరం లేకుండా, 11 సంవత్సరాల బాలుడిని తాగిన మైకంలో కర్రకు కారం పెట్టి కొట్టిన కసాయి తండ్రిపై శుక్రవారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సంఘటన జమ్మికుంట పట్టణంలో చోటుచేసుకుంది. జమ్మికుంట టౌన్ సిఐ పింగిళి ప్రశాంత్‌రెడ్డి తెలిపిన వివారాల ప్రకారం..జమ్మికుంట పట్టణంలోని మోత్కులగుడెం గ్రామంలో మొలుగూరి శ్రీనివాస్-రమ్యలు కూలీ పని చేసుకుంటూ జివనం సాగిస్తున్నారు. వీరికి కుమారుడు, కూతురు ఉన్నారు. కూతురు హాస్టల్‌లో ఉండి చదువుకుంటుండగా, కొడుకు శశికుమారు(11) తల్లిదండ్రులతో ఉంటూ స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నాడు. కన్న తండ్రి శ్రీనివాస్ రోజు రాత్రి పూట మద్యం తాగి, తాగిన మైకంలో భార్య రమ్య, కొడుకును నిత్యం కొడుతుంటాడని, గురువారం రాత్రి తల్లి ఇంట్లో లేని సమయంలో తలుపులు పెట్టి కర్రం పట్టి కొడుకును చికత బాదుతుండగా, దెబ్బలు తట్టుకోలేక, అరవడంతో పక్కింటి వాళ్ళు కాపాడారు. తల్లి వచ్చిన అనంతరం ఏడ్చుకుంటు బాధ తెలుపడంతో తల్లి రమ్య, కొడుకు శశికుమార్ కలిసి జమ్మికుంట సిఐ ప్రశాంత్‌రెడ్డికి శుక్రవారం ఫిర్యాదు చేశారు. సిఐ తండ్రి శ్రీనివాస్‌ను తీసుకవచ్చి బాలుని ఎదుట విచారణ జరిపారు. ఈ క్రమంలో బాలుడు తీవ్ర ఆవేదనతో నన్ను ఎందుకు కన్నావని, నీ లాంటి తండ్రి నాకు వద్దని, నన్ను హాస్టల్‌లో చేర్పించాలని బాగా చదువుకుంటానని సిఐని వేడుకున్నారు. బాలుడి ఆవేదనతో చలించిన సిఐ చదువు భాధ్యత తీసుకుంటానని, తండ్రిపై కేసు నమోదు చేస్తానని తెలిపారు.

పసుపు రైతు ఆత్మహత్యాయత్నం కలకలం
జగిత్యాల, ఫిబ్రవరి 23: జగిత్యాల రైతు ఐక్య వేదిక అధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన రైతు నిరసన ర్యాలీ కలెక్టరేట్‌కు చేరుకోగా, మల్యాల మండలం రామన్నపేటకు చెందిన రాజిరెడ్డి అనే రైతు అదే సమయంలో ఆత్మహత్య యత్నానికి యత్నించడం కలకలం రేపింది. కలెక్టరేట్‌కు పెద్ద ఎత్తున రైతులు తరలిరాగా, రోజురోజుకు పసుపు ధర పతనం కావడంతో మనస్థాపం చెందిన రాజిరెడ్డి అనే రైతు కలెక్టరేట్ గేటుకు తన పంచెతో ఆత్మహత్య యత్నానికి పాల్పడడం తీవ్ర కలకలం రేపింది. పక్కనే ఉన్న రైతులు రైతు రాజిరెడ్డిని నిలువరించి కాపాడారు.