క్రైమ్/లీగల్

కేటుగాడి అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముకరంపుర కరీంనగర్, ఆగస్టు 27: ఒఎల్‌ఎక్స్ యాడ్స్ పేరుతో నిరుద్యోగుల వద్ద డబ్బులు వసూలు చేసు తన్న కేటుగాడు కట్కూరి శరత్ రెడ్డిని అరెస్ట్ చేసినట్లు కరీంనగర్ ఏసీపీ వెంకటరమణ తెలిపారు. సోమవారం వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో విలేఖరులకు ఏసీపీ వివరాలు వెల్లడించారు. సూర్యాపేట జిల్లా దేశాయిగూడెంకు చెందిన శరత్ రెడ్డి బీటెక్ పూర్తిచేసి కొంత కా లం కేసీఆర్ కిట్ పథకంలో ఔట్ సో ర్సింగ్ ఉద్యోగిగా పనిచేశాడు. ఈ వి భాగంలో మంచి నైపుణ్యం సంపాదించడంతో పాటు జల్సాలకు అలవాటుపడ్డాడు. వేతనం ద్వారా వచ్చే డబ్బులు సరిపోకపోవడంతో తాను నేర్చుకున్న ఆన్‌లైన్ పనులను మోసాలకు ఉపయోగించుకున్నాడు. తన వద్దకు వచ్చేవారికి కేసీఆర్ కిట్‌లో ఎన్‌రోల్‌మెంట్ చేయాలని, దీనికి డబ్బులు ఖర్చు అవుతాయని, అవి ఇస్తే పాస్ వర్డ్ ఇస్తానని, దీంతోనే నెట్ ఓపెన్ అవుతుందని నమ్మించేవాడు. ఇలా కరీంనగర్, సిద్ధిపేట, సూర్యాపేట, ఖమ్మం, వరంగల్ ప్రాంతాల్లో పలువురి ఉద్యోగుల నుంచి డబ్బులు వసూలు చేసి ఫోన్ నెంబర్‌ను బ్లాక్ చేయడం ప్రారంభించాడని తెలిపారు. ఈ క్రమంలో కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం చెంజర్లకు చెందిన సుదగోని సంతోష్ ఎంటెక్ పూర్తి చేసి జాబ్ కోసం ప్రయత్నాలు చేస్తుండగా శరత్ రెడ్డి ఈ ప్రకటనను చూసి ఫోన్ చేయగా ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించాడు. దీనికి గాను 8,500 రూపాయలు ఖర్చవుతుందని నమ్మించాడని అన్నారు. తన బ్యాంక్ అకౌంటులో ఆ డబ్బులు వేయించుకొని తరువాత తన నెంబర్‌ను బ్లాక్ చేయడంతో తాను మోసపోయానని గమనించి వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కరీంనగర్ కలెక్టరేట్‌కు శరత్ రెడ్డి వస్తున్నాడనే సమాచారంతో నిందితున్ని సిఐ ఆదేశాలతో దాడి చేసి పట్టుకొని సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. సీఐ శ్రీనివాస రావు, ఎస్‌ఐ సురేందర్ పాల్గొన్నారు.